Gandhamadan Parvat : శ్రీరాముడి గొప్ప భక్తుడైన హనుమంతుడిని శ్రీరాముడు ఈ భూమిపై శాశ్వతంగా జీవించాలని ఆశీర్వదించాడు. అలాగే ద్వాపర యుగంలో నేను నిన్ను కలుస్తాను అని కూడా చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రూపంలో రాముడు హనుమంతుడిని కలిసాడు. అలాగే హనుమంతుడికి ఈ భూమిపై ఒక్క కల్పం సమయం వరకు జీవించే వరం కూడా ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఒక కల్పం అంటే కలియుగం లేదా కలియుగం ముగిసిన తరువాత కూడా. ఇక హనుమంతుడు కలియుగంలో గంధమాదవ పర్వతంపై నివసిస్తాడని నమ్ముతారు. గంధమాదవ పర్వతంపై నివసిస్తూ శ్రీరాముడిని పూజిస్తాడని విశ్వసిస్తారు. కలియుగంలో హనుమంతుడు నివసించే ఈ గంధమాదవ పర్వతం అసలు ఎక్కడ ఉంది… దీనిని ఎలా చేరుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గంధమాదవ పర్వతం హిమాలయాలల్లోని హిమవంత్ పర్వతానికి దగ్గరగా ఉంది. దీనిని యక్షలోక్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన సరస్సు కూడా ఉంది. దీనిలో హనుమంతుడు వికసించిన తామరలను తెంచి, వాటితో శ్రీరాముడిని పూజిస్తాడు. పురాణాల ప్రకారం, ఈ కమలాలను పొందాలనే కోరిక పౌండ్రా నగరానికి చెందిన నకిలీకృష్ణ పౌండ్రక్ ద్వారా వ్యక్తీకరించబడింది. అతని స్నేహితుడు అయిన వానర ద్విత్ కూడా వీటిని తీసుకురావడానికి ప్రయత్నించాడు. కానీ అది వాళ్లకు వీళ్లు కాలేదు. అంతేకాకుండా హనుమంతుడు నివసించే ఈ గంధమాదవ పర్వతంపై అనేక మంది ఋషులు, సిద్దులు, దేవతలు, గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు నివసిస్తారని వారు అక్కడ భయం లేకుండా స్వేచ్చగా తిరుగుతారని కూడా నమ్ముతారు.
ఇక హిమాలయాలలోని కైలాస పర్వతానికి ఉత్తరాన గంధమాదవ పర్వతం ఉందని, దక్షిణాన కేదార్ పర్వతం ఉందని నమ్ముతారు. సుమేరు పర్వతానికి నాలుగు దిశలల్లో ఉన్న గజ్దంగ్ పర్వతాలలో ఒకదానిని అప్పట్లో గంధమాదవ్ పర్వతం అని పిలిచేవారు. నేడు ఈ ప్రాంతం టిబెట్ లో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి. మొదటిది నేపాల్ ద్వారా మానససరోవరం దాటి చేరుకోవచ్చు. రెండవది భూటాన్ కొండల ద్వారా వెళ్లవచ్చు. ఇక మూడవది అరుణాచల్ ప్రదేశ్ మీదుగా చైనా మీదుగా వెళ్లవచ్చు.