వినోదం

Attarintiki Daredi : అత్తారింటికి దారేది మూవీని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

Attarintiki Daredi : పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినా ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ అన్నయ్యే చిరంజీవి అనిపించుకున్న స్టార్. భిన్నమైన ఆలోచనా ధోరణి ఉన్న పవన్ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలున్నాయి. ఆయ‌న‌ సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆ మధ్య కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ రికార్డులు బద్దలుకొట్టింది. గబ్బర్ సింగ్ తరువాత వచ్చిన అత్తారింటికి దారేది మూవీ సంచలనం సృష్టించింది.

అయితే ఈ సినిమా తీయడంలో పలు ట్విస్ట్ లు ఉన్నాయి. అవేంటంటే.. ఈ సినిమాలో ఐటమ్ సాంగులో మొదట అనసూయను అనుకున్నారట. ఆమె నిరాకరించడంతో హంసానందినిని ఎంపిక చేశారు. ఖుషి సినిమాలో గజ్జె ఘల్లుమన్నాదిరో అనే సాంగులో నర్తించిన ముంతాజ్ ను 12 ఏళ్ల తరువాత తీసుకొచ్చి ఐటమ్ సాంగులో చేయించారు. ఈ సినిమాకు మొదట వెంకటేశ్ హీరోగా అనుకున్నారట. కానీ ఆయన నో చెప్పడంతో ఈ ఆఫర్ పవన్ కు వచ్చింది. ఇక పవన్ కు జోడీగా ఇలియానాను అనుకున్నారట. ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ అదృష్టం సమంతను వరించింది. రెండో హీరోయిన్ గా ప్రణీతను ఎంచుకున్నారు.

Attarintiki Daredi movie do you know who missed it

సినిమాను కొద్దిరోజులు స్పెయిన్ లో షూట్ చేశారు. దాదాపు 45 రోజుల పాటు అక్కడే షూటింగ్ చేశారు. ఇందులో నదియా, పవన్ కల్యాణ్ మధ్య జరిగే సన్నివేశాలకు పవనే దర్శకత్వం వహించాడని చెబుతుంటారు. మొత్తానికి ఈ సినిమా విడుదలై ఎన్నో రికార్డులు సృష్టించింది. 4 ఫిలింఫేర్ అవార్డులు, 6 ఫైమా అవార్డులు సొంతం చేసుకుంది. అంతేకాదు కలెక్షన్ల మోత మోగించింది. 170 కేంద్రాల్లో అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకుంది. 36 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచింది. భవిష్యత్ లో కూడా వీరి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వచ్చి ప్రేక్షకులకు వినోదం పంచాలని అభిమానులు కోరుతున్నారు.

Admin

Recent Posts