Bellam Semiya Kesari : బెల్లం సేమియా కేస‌రి ఇలా చేసి చూడండి.. ఎంతో క‌మ్మ‌గా ఉంటుంది..!

Bellam Semiya Kesari : సేమియాతో మ‌నం అనేక ర‌కాల తీపి వంట‌కాల‌ను తయారు చేస్తూ ఉంటాము. సేమియాతో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. సేమియాతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో సేమియా కేస‌రి కూడా ఒక‌టి. బెల్లంతో చేసే ఈ సేమియా కేస‌రి చాలా రుచిగా ఉంటుంది. నైవేథ్యంగా కూడా దీనిని తయారు చేసుకోవ‌చ్చు. ఈ కేస‌రిని తాయారు చేసుకోవ‌డం చాలా తేలిక‌. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ బెల్లం సేమియా కేస‌రిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం సేమియా కేస‌రి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, సేమియా – ఒక క‌ప్పు, నీళ్లు – 2 క‌ప్పులు, బెల్లం తురుము – ముప్పావు క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్.

Bellam Semiya Kesari recipe in telugu very tasty if you make like this
Bellam Semiya Kesari

బెల్లం సేమియా కేస‌రి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో మ‌రో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత సేమియా వేసి వేయించాలి. దీనిని కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక సేమియా వేసి ఉడికించాలి. దీనిని మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత బెల్లం తురుము వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. దీనిని మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ సేమియా ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. చివ‌ర‌గా యాల‌కుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం సేమియా కేస‌రి త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా సేమియాతో రుచిగా అప్ప‌టిక‌ప్పుడు కేస‌రిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts