Aloo Bonda : రుచిగా క‌ర‌క‌ర‌లాడేలా ఆలు బొండాల‌ను ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Aloo Bonda : మ‌నం బంగాళాదుంప‌ల‌తో వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో ఆలూ బోండాలు కూడా ఒక‌టి. వీటిని అల్పాహారంగా కూడా తీసుకోవ‌చ్చు. సాయంత్రం స‌మ‌యాల్లో ఇవి మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద కూడా ల‌భిస్తూ ఉంటాయి. ఈ ఆలూ బోండాల‌ను మ‌నం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవ‌చ్చు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా ఆలూ బోండాల‌ను తయారు చేసి తీసుకోవ‌చ్చు. క్రిస్పీగా, రుచిగా ఉండేలా ఆలై బోండాల‌ను స్ట్రీట్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ బోండా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఆలూ మిశ్ర‌మం తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 3, ప‌చ్చిమిర్చి – 3, అల్లం – అర అంగుళం ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ధ‌నియాలు – అర టీ స్పూన్, నూనె – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఇంగువ – అర టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, ఉప్పు- త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Aloo Bonda recipe very tasty make like this perfect way
Aloo Bonda

పిండి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, బియ్యంపిండి – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, నీళ్లు – త‌గిన‌న్ని.

ఆలూ బోండా త‌యారీ విధానం..

ముందుగా పిండిని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో శ‌న‌గపిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో బియ్యంపిండి, ఉప్పు, ప‌సుపు, కారం, వాము వేసి కల‌పాలి. త‌రువాత కొద్దిగా నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. పిండి మ‌రీ ప‌లుచగా, మ‌రీ చిక్క‌గా కాకుండా చూసుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు ఆలూ స్ట‌ఫింగ్ కోసం ఉడికించిన బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత జార్ లో ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, ధ‌నియాలు వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి.త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి మిశ్ర‌మం వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి.

త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ఆమ్ చూర్ పొడి, ఇంగువ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌ల‌ను వేసి త‌డి పోయే వ‌ర‌కు వేయించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆలూ మిశ్ర‌మం చ‌ల్లారిన త‌రువాత ఉండలుగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకుని ముందుగా క‌లిపిన పిండిలో వేసుకోవాలి. త‌రువాత ఆలూ ఉండ‌ల‌ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంటపై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బోండా త‌యార‌వుతుంది. దీనిని గ్రీన్ చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా త‌యారు చేసిన ఆలూ బోండాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts