Bhimla Nayak : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం నుంచి కళావతి అనే సాంగ్‌ను గత 3 రోజుల కిందట కొందరు లీక్ చేసిన విషయం విదితమే. ఆ సాంగ్‌ను వాస్తవానికి సోమవారం ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా లాంచ్ చేద్దామనుకున్నారు. కానీ సాంగ్ లీక్ కావడంతో ఆ పాటను ఆదివారమే విడుదల చేయాల్సి వచ్చింది. ఇక ఆ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే కళావతి సాంగ్ లాగే భీమ్లా నాయక్‌లోని ఓ పాటను కొందరు లీకు వీరులు లీక్ చేశారు. దీంతో ఆ చిత్ర యూనిట్‌కు షాక్ తగిలింది.
భీమ్లా నాయక్‌లోని ఓ పాటో పవన్ కల్యాణ్ వేసిన డ్యాన్స్ స్టెప్పులకు చెందిన వీడియోను కొందరు లీక్ చేశారు. అయితే దీన్ని ఎవరు లీక్ చేశారు ? అన్న వివరాలు ఇంకా తెలియలేదు. కానీ దీనిపై చిత్ర యూనిట్ గట్టిగానే స్పందించినట్లు తెలుస్తోంది. కళావతి సాంగ్ అనంతరం సర్కారు వారి పాట చిత్ర యూనిట్ ప్రొడక్షన్ స్టూడియోల వద్ద సెక్యూరిటీని పటిష్టం చేసింది. అలాగే భీమ్లా నాయక్ టీమ్ కూడా సెక్యూరిటీని పెంచింది.
అయితే భీమ్లా నాయక్ నుంచి లీక్ అయిన సాంగ్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. దీంతో ఆ సాంగ్ వైరల్‌గా మారింది. కళావతి సాంగ్ లీక్ అయిన అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దాదాపుగా కన్నీటి పర్యంతం అయ్యాడు. 1000 మంది కష్టాన్ని అలా దోచుకున్నారని అన్నాడు. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్‌కు సరిగ్గా అలాంటి పరిస్థితే నెలకొంది. అయితే ఈ మూవీకి కూడా థమన్ యే మ్యూజిక్ అందించడం విశేషం.