DJ Tillu Movie : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి హీరోయిన్‌గా వచ్చిన చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైంది. మొదటి రోజు నుంచే మంచి టాక్‌ను సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. భారీగా కలెక్షన్లను కూడా రాబడుతోంది. యూత్‌కి ఈ మూవీ చక్కగా కనెక్ట్ అయిందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ మూవీ విదేశాల్లోనూ మంచి కలెక్షన్స్‌ను రాబడుతోంది. విదేశాల్లో ఈ సినిమా దాదాపుగా రూ.65 లక్షల బిజినెస్ చేయగా.. మొదటి రోజు అమెరికాలోనే 2 లక్షల డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ క్రమంలోనే డీజే టిల్లు హిట్ అయిందని చెప్పవచ్చు.
ఇక అన్ని సినిమాలు విడుదలైన తరువాత 35 రోజులకు ఓటీటీల్లో వస్తున్నాయి. ఈ క్రమంలోనే డీజే టిల్లు మూవీ కూడా ఓటీటీలో రానుంది. ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా ఈ మూవీకి డిజిటల్ హక్కులను పొందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుందని అంటున్నారు. ఇక దీన్ని ఆహాలో మార్చి 19వ తేదీ తరువాత స్ట్రీమ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
డీజే టిల్లు మూవీకి చెందిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అవే ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించాయని అంటున్నారు. ఇక మూవీకి తెలంగాణలో రూ.2.80 కోట్లు, రాయలసీమలో రూ.1.50 కోట్లు, ఆంధ్రాలో రూ.3.40 కోట్లు మొత్తం.. రూ.7.70 కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఇక యూత్ బాగా కనెక్ట్ అవడంతోపాటు వాలెంటైన్స్ డే ఉన్నందున.. మరింత మంది యూత్ ఈ మూవీని చూస్తారని అంచనా వేస్తున్నారు.