Bhindi 65 : బెండకాయ 65.. ఇలా చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..

Bhindi 65 : బెండకాయలతో సహజంగానే చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు. బెండకాయ పులుసు, వేపుడు.. ఇలా రక రకాల కూరలను చేసి తింటుంటారు. అయితే బెండకాయలతో బెండకాయ 65 వంటి స్నాక్స్‌ను కూడా చేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బెండకాయలను తినలేని వారు కూడా ఇలా చేస్తే వాటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఇక బెండకాయ 65ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బెండకాయ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..

బెండకాయలు – అర కిలో, శనగపిండి – పావు కిలో, ఉల్లి గింజలు – అర టీస్పూన్‌, పచ్చి మిర్చి – ఐదు, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు, అల్లం – ఒక ఇంచు ముక్క, జీలకర్ర పొడి – అరటీస్పూన్‌, పసుపు – అర టీస్పూన్‌, గరం మసాలా – ఒక టీస్పూన్‌, ధనియాల పొడి – ఒకటిన్నర టీస్పూన్‌, సోంపు – ఒక టీస్పూన్‌, ఆమ్‌ చూర్‌ – అర టీస్పూన్‌, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా.

Bhindi 65 here it is how to make this
Bhindi 65

బెండకాయ 65ని తయారు చేసే విధానం..

బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడిచి తొడిమలు, చివర్లు తీయాలి. పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లిని సన్నగా తరగాలి. ఒక గిన్నె తీసుకుని అవన్నీ వేసి పకోడీల పిండిలా కలపాలి. ఈ మిశ్రమంలో బెండకాయలను ముంచాలి. తరువాత నాన్‌ స్టిక్‌ పాన్‌లో నూనె వేసి బెండకాయలన్నింటినీ వరుసగా అమర్చి సిమ్‌లో మూత లేకుండా ఐదు నిమిషాల పాటు నీరంతా ఆవిరయ్యే వరకు ఉడికించాలి. తరువాత నెమ్మదిగా రెండు నిమిషాల పాటు కదుపుతూ ఉడికించాలి. తరువాత మూత పెట్టి ముక్కలు ఉడికే వరకు ఉంచాలి. బెండకాయలు ఉడికిన తరువాత మూత తీసి నెమ్మదిగా కదుపుతూ వేయించి తీయాలి. దీంతో రుచికరమైన బెండకాయ 65 తయారవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts