Fenugreek Seeds : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి అనేక రకాలైన వంట దినుసులను ఉపయోగిస్తున్నారు. వాటిల్లో మెంతులు కూడా ఒకటి. మెంతులను నిత్యం కూరల్లో వేస్తుంటారు. అలాగే మెంతి పొడిని కూడా ఉపయోగిస్తుంటారు. మెంతి పొడి లేదా మెంతులను వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే వాస్తవానికి మెంతులు ఆయుర్వేద పరంగా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటితో అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు.
మెంతులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే హైబీపీ కూడా తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా మెంతులతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే పురుషులకు మెంతులు ఒక వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల వారు అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు.
మెంతులను తీసుకోవడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరిగి శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి పురుషులు మెంతులను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక మెంతులను ఎలా తీసుకోవాలంటే..
రాత్రి పూట ఒక టీస్పూన్ మెంతులను ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ మెంతులను తిని ఆ నీళ్లను తాగాలి. లేదా మెంతులను నీటిలో మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు. అయితే మెంతులను తింటే కొందరికి వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం జరుగుతాయి. అలాంటి వారు వాటిని తేనెతో లేదా మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.