Bitter Gourd Juice : కాకర కాయలు.. మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో ఇది కూడా ఒకటి. ఇతర కూరగాయల లాగా కాకర కాయలలో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి. చేదుగా ఉంటుదన్న మాటే కానీ కాకర కాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మనం ఎక్కువగా కాకర కాయలతో వేపుడు, కూరలను చేసుకుని తింటూ ఉంటాం. ఈ విధంగా కాకర కాయలను తీసుకోవడం వల్ల ఫలితం ఉన్నప్పటికీ అధిక ఫలితం ఉండదు. కాకరకాయను జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కాకర కాయను జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు కాకర కాయ దివ్యౌషధమనే చెప్పవచ్చు. కాకర కాయ జ్యూస్ ను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కాలేయం పని తీరు మెరుగుపడుతుంది. జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడే వారు కాకరకాయను జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మనం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం.
కాకర కాయ జ్యూస్ ను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ కాకరకాయ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక జార్ లో రెండు కాకరకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత అందులో అల్లం ముక్కలను, నిమ్మకాయ రసాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ జ్యూస్ వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కాకర కాయ జ్యూస్ ను రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి రావడంతో పాటు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు.