Boiled Eggs Roast Curry : కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి ఇలా కూర చేసుకుని తినండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Boiled Eggs Roast Curry : కోడిగుడ్లు అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి.. అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని కొంద‌రు ఉడ‌క‌బెట్టి తింటారు. కొంద‌రు ఆమ్లెట్‌లా వేసుకుని తింటారు. కొంద‌రికి కోడిగుడ్ల వేపుడు అంటే ఇష్టంగా ఉంటుంది. ఇలా చాలా మంది వీటిని ర‌క‌ర‌కాలుగా తింటుంటారు. అయితే కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి వాటిని రోస్ట్ చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే బాయిల్డ్ ఎగ్స్ రోస్ట్ క‌ర్రీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బాయిల్డ్ ఎగ్స్ రోస్ట్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్లు – 7, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్‌, జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్‌, సోంపు – ఒక టేబుల్ స్పూన్‌, మిరియాలు – అర టీస్పూన్‌, ల‌వంగాలు – ఆరు, దాల్చిన చెక్క – ఒక ముక్క‌, ఎండు మిర్చి – 12, నెయ్యి – పావు క‌ప్పు, ఉల్లిపాయ‌లు – రెండు, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూన్‌, క‌రివేపాకు రెబ్బ‌లు – రెండు, ట‌మాటాలు – రెండు, ప‌సుపు – అర టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌.

Boiled Eggs Roast Curry prepare in this method
Boiled Eggs Roast Curry

బాయిల్డ్ ఎగ్స్ రోస్ట్ క‌ర్రీని త‌యారు చేసే విధానం..

స్ట‌వ్ మీద క‌డాయి పెట్టి ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, సోంపు, మిరియాలు, ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, ఎండు మిర్చి వేయించుకుని ఆ త‌రువాత మెత్త‌గా పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద క‌డాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, అల్లం వెల్లుల్లి ముద్ద‌, క‌రివేపాకు వేసి వేయించుకుని పొడిచేసిన మ‌సాలాతోపాటు మిగిలిన ప‌దార్థాల‌ను వేసి బాగా క‌లిపి పావు క‌ప్పు నీళ్లు పోయాలి. ఈ కూర ద‌గ్గ‌ర‌కు అయ్యాక ఉడికించిన గుడ్లు వేసి బాగా క‌లిపి 1 నిమిషం పాటు ఉంచి దించేయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన బాయిల్డ్ ఎగ్స్ రోస్ట్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీలు వేటితో తిన్నా స‌రే రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts