Bread Crumbs : బ్రెడ్ క్రంబ్స్‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు..!

Bread Crumbs : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కొన్ని ర‌కాల చిరుతిళ్లు క‌ర‌క‌ర‌లాడుతూ ఉండ‌డానికి వాటి త‌యారీలో మ‌నం బ్రెడ్ క్రంబ్స్ ను ఉప‌యోగిస్తూ ఉంటాము. బ్రెబ్ క్రంబ్స్ గురించి మ‌నంద‌రికి తెలిసిందే. ఈ బ్రెడ్ క్రంబ్స్ ను మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల్లో వాడుతూ ఉంటాము. చీస్ బాల్స్, పుడ్డింగ్, కేక్స్, క‌ట్లెట్స్, చికెన్ ఫ్రై, మీట్ బాల్స్, పాస్తా, పొటాటో క‌ట్లెట్స్ ఇలా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల త‌యారీలో వాడుతూ ఉంటాము. ఈ బ్రెడ్ క్రంబ్స్ ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌కాల రుచి పెర‌గ‌డంతో పాటు ఈ వంట‌కాలు క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి.

వంట‌కాలు క్రిస్పీగా ఉండ‌డానికి వీటిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. సాధార‌ణంగా బ్రెడ్ క్రంబ్స్ మ‌న‌కు సూపర్ మార్కెట్ ల‌లో ల‌భిస్తూ ఉంటాయి. అయితే బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇంట్లోనే మ‌నం చాలా సుల‌భంగా బ్రెడ్ క్రంబ్స్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ ఉంటే చాలు వీటిని నిమిషాల వ్య‌వ‌ధిలో త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ క్రంబ్స్ ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Bread Crumbs recipe in telugu how to make this at home
Bread Crumbs

బ్రెడ్ క్రంబ్స్ త‌యారీ విధానం..

ముందుగా 5 బ్రెడ్ స్లైసెస్ ను తీసుకోవాలి. త‌రువాత వాటి చుట్టు ఉండే అంచుల‌ను తీసి వేయాలి. త‌రువాత ఈ బ్రెడ్ ను ముక్క‌లుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. త‌రువాత వీటిని పొడి పొడిగా అయ్యే వ‌ర‌కు మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద క‌ళాయిని ఉంచి అందులో మిక్సీ ప‌ట్టుకున్న బ్రెడ్ ను వేయాలి. త‌రువాత దీనిని చిన్న మంట‌పై క‌లుపుతూ వేయించాలి. ఇలా 10 నుండి 12 నిమిషాల పాటు వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పొడి పొడిగా ఉండే బ్రెడ్ క్రంబ్స్ త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా మూత ఉండే సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఇవి నెల పాటు తాజాగా ఉంటాయి. ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా బ్రెడ్ క్రంబ్స్ ను త‌యారు చేసుకుని వంట‌ల్లో వాడుకోవ‌చ్చు.

Share
D

Recent Posts