Bread Dosa : బ్రెడ్‌తో ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా దోశ‌ల‌ను వేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Bread Dosa : మ‌నం బ్రెడ్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బ్రెడ్ ను పాలతో తిన‌డంంతో పాటు దీనితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. కేవ‌లం చిరుతిళ్ల‌నే కాకుండా బ్రెడ్ తో మ‌నం దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో చేసుకునే దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. కేవ‌లం 5 నిమిషాల్లోనే ఇన్ స్టాంట్ గా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో బ్రెడ్ తో దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రౌన్ బ్రెడ్ – 8 స్లైసెస్, బొంబాయి ర‌వ్వ – అర క‌ప్పు, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, , ఉప్పు – త‌గినంత‌, పెరుగు -2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, మిన‌ప‌ప్పు – అర టీ స్పూన్, అల్లం త‌రుగు – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1.

Bread Dosa recipe in telugu make in this method
Bread Dosa

బ్రెడ్ దోశ త‌యారీ విధానం..

ముందుగా బ్రెడ్ అంచుల‌ను తీసేసి వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అవి మునిగే వ‌ర‌కు నీటిని పోసి 4 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత బ్రెడ్ లో ఉండే నీటినంతా చేత్తో పిండుతూ బ్రెడ్ ను ముక్క‌లుగా చేసుకుని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పెరుగు కూడా వేసి కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ మెత్త‌గా మిక్సీ పట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో ర‌వ్వ‌, బియ్యం పిండి, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లూ పోస్తూ ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత వీటిని ముందుగా సిద్దం చేసుకున్న ర‌వ్వ మిశ్ర‌మంలో వేసి క‌ల‌పాలి. ఇందులోనే మిక్సీ ప‌ట్టుకున్న బ్రెడ్ కూడా వేసి క‌లుపుకోవాలి.

త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ దోశ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక దోశ పిండిని తీసుకుని దోశ‌లా వేసుకోవాలి. త‌రువాత నూనె వేసుకుని రెండు వైపులా ఎర్ర‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ దోశ‌లు మాములు దోశ‌ల వ‌లె ప‌లుచ‌గా రావు. ఇలా చేయ‌డం వ‌ల్ల బ్రెడ్ దోశ‌లు త‌యార‌వుతాయి. వీటిని వేడి వేడిగా అల్లం చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు లేదా వెరైటీగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు బ్రెడ్ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts