Turmeric : ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ప‌సుపును అస‌లు ఎలా ఉప‌యోగించాలంటే..?

Turmeric : ప‌సుపు. మ‌నం ఎక్కువ‌గా దీన్ని వంట‌ల్లో వాడుతాం. దీంతో వంట‌కాల‌కు మంచి రుచి వ‌స్తుంది. అంతేకాకుండా గాయాలు, దెబ్బ‌లు తాకితే మ‌న పెద్ద‌లు కొంత ప‌సుపును వాటిపై ప‌ట్టీలా రాస్తారు. దీంతో అవి త్వ‌ర‌గా మానుతాయి. అయితే ఇలా రాయ‌డం వ‌ల్ల సెప్టిక్ కాకుండా ఉంటుంది. యాంటీ సెప్టిక్ గుణాలు పసుపులో ఉన్నాయి. అందుక‌నే గాయాలు, పుండ్లు ఇన్‌ఫెక్ష‌న్ కావు. అయితే ఇవే కాదు, యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు కూడా ప‌సుపులో ఉన్నాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌లను ప‌సుపు ద్వారా మ‌నం నయం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి నిద్రించ‌డానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు ప‌సుపు, కొద్దిగా మిరియాల పొడి క‌లుపుకుని తాగితే ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి. జామ ఆకులు కొన్నింటిని, ప‌సుపు కొంత తీసుకుని రెండింటినీ బాగా క‌లిపి ముద్ద‌గా నూరాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఏర్ప‌డే మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోతాయి. ప‌సుపును నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే దాని వ‌ల్ల శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ మాయ‌మ‌వుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది.

how to use turmeric for different health problems
Turmeric

ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని బాగా మ‌ర‌గ‌బెట్టాలి. అందులోంచి ఆవిరి బాగా వ‌స్తున్న‌ప్పుడు పాత్రను దించి అందులో కొంత ఉప్పు, ప‌సుపు వేసి వ‌చ్చే ఆవిరిని పీల్చాలి. దీంతో ద‌గ్గు, జ‌లుబు వంటివి వెంట‌నే త‌గ్గుతాయి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఊపిరి తిత్తులు, ఇత‌ర శ్వాస కోశ స‌మ‌స్య‌లు కూడా పోతాయి. గురక ఉన్న‌వారు ఇలా చేస్తే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఒక ప‌సుపు కొమ్ము తీసుకుని దానికి వేడి నీళ్లు క‌లిపి ముద్ద‌గా నూరాలి. దీన్ని త‌ల‌కు ప‌ట్టించి స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌ల తిరుగుడు త‌గ్గుతుంది. వేపాకు, ప‌సుపు రెండింటినీ స‌మ పాళ్ల‌లో తీసుకుని బాగా నూరి మిశ్ర‌మంగా చేయాలి. దీన్ని శ‌రీరానికి ప‌ట్టించి కొంత సేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గ‌జ్జి, తామ‌ర, దుర‌ద‌లు వంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

కొద్దిగా వేప నూనె తీసుకుని దాన్ని వేడి చేయాలి. అందులో ప‌సుపు క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీన్ని గాయాలు, దెబ్బ‌లు, కురుపులు వంటి వాటిపై రాస్తే వెంట‌నే అవి త‌గ్గుముఖం ప‌డ‌తాయి. ఏవైనా కీట‌కాలు మ‌న శ‌రీరాన్ని కుట్టినా లేదంటే పాకినా అయ్యే దుర‌ద‌, పుండ్ల‌పై కూడా దీన్ని రాయ‌వ‌చ్చు. ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ప‌సుపు, ఉప్పు, కొద్దిగా నీరు క‌లిపి మెత్త‌ని పేస్ట్‌లా చేసి దాంతో దంతాల‌ను రోజూ తోముకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా మారుతాయి. దంతాలు, చిగుళ్ల నొప్పి, వాపులు త‌గ్గుతాయి. పిప్పి ప‌న్ను ఉన్న‌వారు ఇలా చేస్తే వెంట‌నే ఆ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ప‌సుపు, గంధం, వేప‌, తుల‌సి ఆకుల‌ను స‌మ భాగాలుగా తీసుకుని మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని రాస్తుంటే చికెన్ పాక్స్ (ఆట‌లమ్మ‌) త‌గ్గుతుంది.

ప‌సుపు, కొద్దిగా నిమ్మ‌ర‌సం, బియ్య‌పు పిండిని క‌లిపి మిశ్ర‌మంగా చేసి దాన్ని ముఖానికి రాయాలి. అనంతరం 30 నిమిషాలు ఆగాక నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎండ బారిన ప‌డి న‌ల్ల‌గా అయిన చ‌ర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది. ప‌సుపు కొమ్మును బాగా నూరి దాన్ని మ‌జ్జ‌గలో క‌లిపి తాగితే దీర్ఘ కాలికంగా ఉన్న చ‌ర్మ‌వ్యాధులు తగ్గుతాయి. విరేచ‌నాలకు, కీళ్ల నొప్పుల‌కు ఇది మంచి ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. ప‌సుపు, పెరుగు, గంధంల‌ను స‌మ భాగాల్లో తీసుకుని బాగా క‌లిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాయాలి. 30 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే న‌ల్ల‌ని మ‌చ్చ‌లు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.

Share
Editor

Recent Posts