vastu

Water In Bucket : బ‌కెట్‌లో నీళ్ల‌ను నింపి వంట గ‌దిలో ఇలా పెడితే..?

Water In Bucket : చాలామంది తెలియక కొన్ని పొరపాట్ల‌ని చేస్తూ ఉంటారు. అలాంటి పొరపాట్లని అస్సలు చేయకూడదు. ఇటువంటివి అస్సలు ఎవరు కూడా చేయకూడదు. మరి ఎటువంటి పొరపాట్లని చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం. మంచం మీద కూర్చుని తినడం అస్సలు మంచిది కాదు. ఇంట్లో అశాంతి కలుగుతుంది. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వలన అనేక రకాల వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఆ అలవాటుని మానుకోవడం మంచిది.

రాత్రి పూట పడుకునే ముందు ఇంటి వంట గదిలో ఒక బకెట్ నిండా నీళ్లు ఉంచితే అద్భుతమైన లాభాలని పొందచ్చు. రుణ బాధల నుండి బయటపడొచ్చు. రాత్రి పడుకునే ముందు బకెట్ ని ఇలా నింపి వంట గదిలో ఉంచడం వలన జీవితంలో పురోగతికి మార్గం తెరుస్తుంది. కాబట్టి ఇలా చేయండి. కొంతమంది రాత్రి పూట వంట గదిలో పాత్రలని కడగ‌కుండా వదిలేస్తుంటారు. దీని వలన హాని కలుగుతుంది.

bucket of water and its benefits according to vastu

రాత్రిపూట మీరు పాత్రలని శుభ్రం చేయకపోతే ఆహారాన్ని నీటితో కడిగేసి వదిలేయండి. వంట పాత్రలని శుభ్రం చేయకపోతే అన్నపూర్ణా దేవికి కోపం వస్తుంది. ఎప్పుడూ ఈశాన్యంలో ఒక డబ్బాలో కానీ చిన్న పాత్రలో కానీ నీటిని ఉంచండి. అలా చేయడం వలన ఇంట్లో నివసించే వాళ్ళకి మంచి జరుగుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆ నీటిని మొక్కలకి పోసేయండి.

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డస్ట్ బిన్ ని అస్సలు పెట్టకూడదు. దాని వలన అనవసరంగా ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. డస్ట్ బిన్ ని ముఖద్వారం దగ్గర ఉంచితే ఇరుగుపొరుగు వారు శత్రువులు అవుతారు. సూర్యాస్తమయం తర్వాత పెరుగు, ఉల్లిపాయ, పాలు, ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.

Admin

Recent Posts