Vastu Tips : వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులు ఇంటి వాతావరణంపై శుభ మరియు అశుభ ఫలితాలను చూపిస్తాయి. మనం తెలియక ఇంట్లో ఉంచే కొన్ని వస్తువులు మనకు అశుభ ఫలితాలను కలిగించడంతో పాటుగా ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉండేలా చేస్తాయి. ఈ వస్తువులను ఉంచడం వల్ల వ్యాధులు, ఆర్థిక సమస్యలు, పేదరికం బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఇటువంటి వస్తువులను వెంటనే ఇంట్లో నుండి తీసి వేయడం మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇంట్లో ఉంచకూడని వస్తువులు ఏమిటో… ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో గడియారాన్ని మూసి ఉంచడం, అలాగే పని చేయని గడియారాలను ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. ఇవి చెడు సమయాన్ని ఆహ్వానిస్తాయి. మన పురోగతిలో ఆటంకం కలుగుతుంది.
జీవితంలో సమస్యలు ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంటాయి. అలాగే ఇంట్లో చెత్తను ఉంచుకోకూడదు. చెత్త ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదు. అలాంటి ఇళ్లల్లో డబ్బు కూడా ఉండదు. అంతేకాకుండా సంతోషం, శ్రేయస్సు కూడా ఉండవు. చెత్త ఉండే ఇంట్లో ప్రతికూలత, పేదరికం ఉంటుంది. కనుక ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఇంట్లో విరిగిన, పగిలిన పాత్రలను ఉంచకూడదు. ఇవి మనల్ని తొందరగా పేదలుగా మార్చేస్తాయి. ఇంట్లో విరిగిన పాత్రలు ఉండడం వల్ల మనం ఎంత కష్టపడి పని చేసినప్పటికి డబ్బు నిలవదు. కనుక విరిగిన, పగిలిన పాత్రలను వెంటనే మార్చేయడం మంచిది. అలాగే ఇళ్లల్లో ముళ్ల మొక్కలు ఉండకూడదని వాస్తుశాస్త్రం చెబుతుంది.
ముళ్ల మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో మనస్పర్థలు, గొడవలు, ఆందోళనలు, రోగాలు వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో చిరిగిన, రంగు వెలసిన బట్టలను, పాత బట్టలను ఉంచుకోకూడదు. ఇవి అశుభాన్ని సూచిస్తాయి. ఇలాంటి బట్టలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థిక పురోగతికి ఆటంకాలు ఏర్పడతాయి. కనుక ఇంట్లో పాత, చిరిగిన బట్టలను ఉంచుకోకపోవడమే మంచిది. ఈ విధంగా ఈ వస్తువులను ఇంట్లో నుండి వెంటనే తీసి వేయాలని ఇవి ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు చెడు తప్ప మంచి జరగదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.