ఆధ్యాత్మికం

Vishnu Rekha : మీ అర‌చేతిలో విష్ణు రేఖ ఉందా.. అయితే మీరు కోటీశ్వ‌రులు కావ‌డం ఖాయం..!

Vishnu Rekha : మ‌న అర‌చేతి యొక్క గీత‌లు, గుర్తులు, నిర్మాణాలు వ్య‌క్తి యొక్క వ్య‌క్తిత్వాన్ని మ‌రియు అత‌ని భ‌విష్య‌త్తునుగురించి చాలా చెబుతాయి. హ‌స్తసాముద్రికంలో ఈ రేఖ‌లు, గుర్తుల గురించి తెలుసుకునే ప‌ద్ద‌తుల గురించి చ‌క్క‌గా వివ‌రించ‌బ‌డ్డాయి. దీంతో పాటు అవి క‌లిగించే శుభ‌, అశుభ ఫ‌లితాల గురించి కూడా అనేకం వివ‌రించారు. అలాగే ఈ రోజు మ‌నం అదృష్టవంతుల చేతుల్లో ఉండే ఒక రేఖ గురించి అలాగే అది క‌లిగించే శుభ ఫ‌లితాల గురించి తెలుసుకుందాం. ఇక ఈ రేఖ‌యే విష్ణు రేఖ‌. చేతిలో ఈ రేఖ ఉన్న వారు ధ‌న‌వంతులు అవుతారు. ఆనందాన్ని, ఉన్న‌త ప‌ద‌వుల‌ను, గౌర‌వాన్ని పొందుతారు. మ‌న అర‌చేతిలో హృద‌య రేఖ నుండి ఒక రేఖ ఉద్భ‌వించి బృహ‌స్ప‌తి ప‌ర్వ‌తాన్ని చేరుకుంటే దానిని విష్ణు రేఖ అంటారు.

ఈ రేఖ హృద‌య రేఖ‌ను రుండు భాగాలుగా చీల్చినట్టు క‌నిపిస్తుంది. చేతిపై విష్ణురేఖ ఉన్న‌వారికి ప్ర‌త్యేక ఆశ్వీరాదం ఉంటుంది. అలాగే ఈ రేఖ క‌లిగిన వారికి గురుగ్ర‌హం కూడా చాలా బ‌లంగా ఉంటుంది. బృహ‌స్ప‌తి సంప‌ద‌, సౌభాగ్యం, సంతోషం, పిల్ల‌లు,జ్ఞానం, గౌర‌వానికి కార‌కుడు. అందుచేత విష్ణురేఖ ఉన్న వారు చాలా అదృష్ట‌వంతులు. వీరు క‌ష్టాల‌ను కూడా చాలా త‌క్కువ‌గా ఎదుర్కొంటారు. విష్ణురేఖ ఉన్న‌వారు శ్రీ మ‌హావిష్ణువు కృప‌తో ఆనందాల‌ను సుల‌భంగా పొందుతారు. అలాగే విష్ణురేఖ ఉన్న‌వారికి జ్ఞానం ఎక్కువ‌గా ఉంటుంది. వీరు వీరి జ్ఞానం ఆధారంగా గౌర‌వం పొందుతారు. అలాగే వారు చాలా మంచి జీవిత భాగ‌స్వామిని పొందుతారు.

if you have this line in hand then you will become wealthy

వీరి వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే విష్ణురేఖ ఈ వ్య‌క్తుల‌కు అపార‌మైన సంప‌ద‌తో పాటు ఉన్న‌త‌స్థానం మ‌రియు ప్ర‌తిష్ట‌ను ఇస్తుంది. ఈ రేఖ ఉన్న వారు ఏ రంగంలోకి వెళ్లిన కూడా ఉన్న‌త స్థానానికి చేరుకుంటారు. ముఖ్యంగా విద్య‌, ఆధ్యాత్మిక రంగాల్లో గౌర‌వం ఎక్కువ‌గా ల‌భిస్తుంది. విష్ణురేఖ ఉన్న‌వారు నిరుపేద కుటుంబంలో పుట్టిన ఉన్న‌త స్థానానికి చేరుకుంటారు. ఎన్ని స‌వాళ్ల‌నైనా ఎదుర్కొని ఖ‌చ్చితంగా విజ‌యాన్ని సాధిస్తారు.

Admin

Recent Posts