Cabbage Manchuria : క్యాబేజీతో చేసే ఈ మంచూరియాను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ఇలా చేయండి.. బాగుంటుంది..!

Cabbage Manchuria : మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే ప‌దార్థాల్లో మంచురియా కూడా ఒక‌టి. మంచురియా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే దీనిని త‌యారు చేయ‌డానికి ర‌క‌ర‌కాల సాస్ ల‌ను వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఈ సాస్ లు అంద‌రికి అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు. కొంద‌రికి సాస్ ల‌ను వేయ‌డం ఇష్టం ఉండ‌క‌పోవ‌చ్చు. అలాంటి వారు కింద చెప్పిన విధంగా ఎటువంటి సాస్ లు వేయ‌కుండా కూడా రుచిక‌ర‌మైన మంచురియాను త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం మ‌న‌కు అందుబాటులో ఉండే ప‌దార్థాల‌తో సాస్ లు వేయ‌కుండా రుచిగా మంచురియాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మంచురియా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌న్న‌గా త‌రిగిన క్యాబేజి తురుము – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, మిరియాల పొడి – చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, మైదాపిండి – అర క‌ప్పు, కార్న్ ఫ్లోర్ – 3 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Cabbage Manchuria recipe in telugu make in this method
Cabbage Manchuria

టాసింగ్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ -1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, ట‌మాట – 1, ఉప్పు – కొద్దిగా, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్.

మంచురియా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో క్యాబేజి తురుమును తీసుకోవాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండి కంటే మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కొద్ది కొద్దిగా క్యాబేజి మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ఉండ‌లుగా చేసుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత లోతుగా ఉండే ఇనుప క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఇనుప క‌ళాయి లేని వారు మామూలు క‌ళాయిలో కూడా దీనిని చేసుకోవ‌చ్చు. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, ప‌సుపు, ఉప్పు, కారం, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి.

త‌రువాత ట‌మాటను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించిన త‌రువాత కార్న్ ఫ్లోర్ లో నీటిని పోసి క‌లిపి వేసుకోవాలి. దీనిని చిక్క‌బ‌డే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న మంచురియా వేసి క‌ల‌పాలి. దీనిని పెద్ద మంట‌పై పొడి పొడిగా అయ్యే వ‌ర‌కు వేయించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మంచురియా త‌యార‌వుతుంది. ఇంట్లోనే చాలా సుల‌భంగా ఎటువంటి సాస్ లు వేయ‌కుండా మంచురియాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts