ఆధ్యాత్మికం

అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గులు పెట్టకూడదా?

సాధారణంగా మన హిందువులు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఇల్లు వాకిలి ఊడ్చి నీళ్లు చిమ్మి ముగ్గులు పెడుతూ ఉంటారు. ఈ విధంగా ప్రతి రోజు ఉదయం లేవగానే ముగ్గులు పెట్టడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని భావిస్తారు. పట్టణంలో ఉన్న వారు సైతం చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఉంటారు. కానీ అమావాస్య రోజున మాత్రం ముగ్గులు వేయకూడదని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజు ముగ్గులు ఎందుకు వేయకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

అమావాస్య ముందు రోజున మన ఇంటికి పితృదేవతలు వస్తారని భావిస్తారు. అందుకోసమే పితృదేవతలకు ఆర్ఘ్యం ఇస్తే వారు సంతోషం చెంది మనకు ధనాభివృద్ధి, సంతాన వృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.కనుక అమావాస్య రోజు ఇంటి ముందు శుభ్రం చేసి పెట్టాలి కానీ ముగ్గులు వేయకూడదని పండితులు చెబుతున్నారు.

can we draw rangoli on amavasya

ఒకవేళ ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల పితృదేవతలు రాకుండా ఆగిపోతారు. అమావాస్య రోజున పితృదేవతలను మనసారా ప్రార్థించాలి అంటే ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని పండితులు తెలియజేస్తున్నారు. అమావాస్య అంటే పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకోసమే అమావాస్య రోజు పితృ దేవతలకు ప్రత్యేక పూజలు చేయటం వల్ల ఉంది వారి ఆత్మకు శాంతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts