ఆధ్యాత్మికం

అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు

అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాస శుక్లపక్షం మూడవ రోజు వస్తుంది. ఈ రోజున పెద్ద ఎత్తున మహాలక్ష్మికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.మొట్టమొదటిసారిగా బంగారం భూలోకంలో గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు బయటపడింది. అందుకే ఈ రోజు అక్షయ తృతీయగా జరుపుకుంటారు.

అక్షయ తృతీయ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూజించిన తర్వాత మన స్తోమతకు తగ్గట్టు గా దాన ధర్మాలను చేయాలి.బియ్యం, ఉప్పు, నెయ్యి, చక్కెర, కూరగాయలు, పండ్లు, చింతపండు, బట్టలు మొదలైనవి దానం చేయడం మంచివని భావిస్తారు.

do not make these mistakes on akshaya tritiya

అమ్మవారికి ఎంతో పవిత్రమైన ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లో మాంసం,ఉల్లిపాయ, వెల్లుల్లితో పాటు మద్యం సేవించడం నిషేధించబడింది. ఇది వ్యాధి సంతాపానికి కారకం. ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు. అక్షయ తృతీయ రోజు మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. ఈ రోజున మన లో ఉన్నటువంటి కోపం,అసూయ, వ్యంగ్యం వంటివి వదిలి పెట్టాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Admin

Recent Posts