Banana Tree In Home : పూర్వపు రోజుల్లో పెరట్లో అరటి చెట్లను ఎక్కువగా నాటేవారు. ఎంతో జాగ్రత్తగా పెంచేవారు. అరటి చెట్టులోని ప్రతిభాగం ఎంతో ఉపయోగకరం. వాటి ఆకులను ఆహారం వడ్డించడానికి ఉపయోగించేవారు. అయితే ఇప్పటి వారు ఈ చెట్టును ఎక్కువగా పెంచడానికి ఆసక్తి చూపడం లేదు. కొంతమంది ఉదయాన్నే లేవగానే ఈ చెట్టును చూడడం అశుభం అనుకుంటారు. దాని కారణంగా చెట్టును పెంచరు. అయితే జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ఈ అరటి మొక్కను పెరట్లో పెంచడం శుభమే అంటున్నారు. అరటి చెట్టును ఈశాన్య దిక్కులో నాటడం ఉత్తమం.
ఇలా నాటడం వలన మన ఇంట్లో సుఖసంపదలు కలుగుతాయి. అలాగే ఈ చెట్టులో నారాయణుడు కొలువై వుంటాడని నమ్మకం. తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే అరటి చెట్టు కింద తులసి చెట్టును నాటాలి. అప్పుడు ఇద్దరి ఆశీస్సులు దక్కుతాయి. ప్రతి గురువారం చెట్టును పసుపు కుంకుమతో పూజించి దీపం వెలిగించాలి. అలా చేయడం వలన గృహంలో సుఖసంపదలు కలుగుతాయి. అరటి చెట్టును ఎప్పుడైననా ఇంటి వెనుక భాగంలో నాటాలి. ఇంటి ముందు భాగంలో నాటకూడదు.
అది అశుభం. అరటి చెట్టును తప్పుగా నాటినా, తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా ఇంట్లో అశుభాలు జరుగుతాయి. చెట్టు చుట్టూ శుభ్రంగా వుంచాలి. ప్రతిరోజు నీళ్లను పోయాలి. ఈ చెట్టుకు బట్టలు, గిన్నెలు కడిగిన, మిగిలిన నీటిని పోయకూడదు. అలా చేయడం అశుభం. అంతేకాదు,ఆకులు ఎండిపోతే వెంటనే తీసివేయాలి. అలాగే ఈ చెట్టుకు జ్యోతిష్యంలో మంచి స్థానం వుంది. ఈ చెట్టు శుభానికి సంకేతం అంటున్నారు వాస్తు పండితులు.