Off Beat

అర‌టి పండ్ల‌తో విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చా ?

స్కూళ్ల‌లో చాలా మంది సైంటిఫిక్ ప్ర‌యోగాల‌ను చేసే ఉంటారు. ప‌లు భిన్న ర‌కాల వ‌స్తువుల‌ను ఉప‌యోగించి విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేయ‌డం నేర్చుకునే ఉంటారు. అయితే అర‌టి పండ్ల‌ను ఉప‌యోగించి విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చా ? అంటే.. అవును, చేయ‌వ‌చ్చ‌నే స‌మాధానం చెప్ప‌వ‌చ్చు.

అర‌టి పండ్ల తొక్క‌ల‌ను మిక్సీలో వేసి పేస్ట్ లా చేయాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ఆనోడ్ రియాక్ట‌ర్ బాక్స్‌లో లేదా బ‌యో చాంబర్‌లో ఉంచాలి. ఇక క్యాథోడ్ చాంబ‌ర్‌లో నీటిని నింపాలి. ఈ క్ర‌మంలో అర‌టి పండు తొక్క మిశ్ర‌మం పులుస్తుంది. అందులో సూక్ష్మ జీవులు త‌యార‌వుతాయి. దీంతో ఎల‌క్ట్రాన్లు ఉత్ప‌త్తి అవుతాయి. ఫ‌లితంగా అవి క్యాథోడ్ వ‌ద్ద‌కు వెళ్తాయి. ఇలా చిన్న‌గ విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చు.

can we produce electricity with banana

అర‌టి పండ్ల‌లో విద్యుత్ నిరోధ‌క‌త త‌క్కువ‌గా ఉంటుంది. ముఖ్యంగా బాగా పండిన అర‌టిపండ్ల‌ను ఉప‌యోగించి విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చు. వాటిల్లో నిరోధ‌కత ఇంకా త‌క్కువ‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలో అలాంటి అర‌టి పండ్ల‌లో ఉండే తేమ కార‌ణంగా ప‌లు అయానిక్ చ‌ర్య‌లు జ‌రుగుతాయి. అందుక‌నే అర‌టి పండ్ల నుంచి విద్యుత్ జ‌నిస్తుంది. ఇక ఫ్రిజ్‌లో ఫ్రీజ్ డ్రైడ్ చేయ‌బ‌డిన అర‌టి పండ్ల‌లో నిరోధ‌క‌త ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక అవి విద్యుత్ ఉత్ప‌త్తికి ప‌నికిరావు. అలాగే అర‌టి పండ్ల ర‌కం, వ్యాసం, పొడ‌వు, పండిన శాతం వంటి అంశాల ఆధారంగా వాటి నుంచి ఉత్ప‌త్తి అయ్యే విద్యుత్ శాతం మారుతుంది. కావాలంటే భిన్న ర‌కాల అర‌టి పండ్ల‌తో ప్ర‌యోగాల‌ను చేయ‌వ‌చ్చు.

Admin

Recent Posts