lifestyle

ఈ 5 చిక్కుముళ్ల‌లాంటి ప్ర‌శ్న‌ల‌ను మీరు సాల్వ్ చేయ‌గ‌లరా..? చేస్తే మీకు బాగా తెలివి తేట‌లున్న‌ట్లే లెక్క తెలుసా..?

సుడోకు.. ప‌ద‌వినోదం.. పొడుపు క‌థ‌లు.. ఇలాంటి ప‌జిల్స్ ఏవైనా స‌రే మ‌న మెద‌డుకు మేత పెడ‌తాయి. మ‌న మెదడు చురుగ్గా ప‌నిచేసేందుకు అవి దోహ‌ద‌ప‌డ‌తాయి. అయితే ఇవే కాదు.. కొన్ని చిక్కు ప్ర‌శ్న‌లు కూడా మ‌న మెద‌డు ప‌నితీరుకు స‌వాల్ విసురుతుంటాయి. వాటిని సాల్వ్ చేసేందుకు బాగా చ‌దువు కూడా అవ‌స‌రం లేదు. చిన్న లాజిక్ చాలు, వాటిని సుల‌భంగా సాధించ‌వ‌చ్చు. కింద ఇచ్చింది కూడా అలాంటి మెద‌డుకు మేత పెట్టే క్లిష్ట‌త‌ర‌మైన ప్ర‌శ్న‌లే. కానీ ఆలోచిస్తే.. వీటిని సాధించ‌డం పెద్ద విష‌య‌మేమీ కాదు. మ‌రి ఆ చిక్కు ప్ర‌శ్న‌ల‌పై ఓ లుక్కేద్దామా..!

1. అది ఒక సైకియాట్రిక్ హాస్పిట‌ల్‌. అక్క‌డ పెద్ద డాక్ట‌ర్‌, కొంద‌రు పేషెంట్లు ఉన్నారు. ఈ క్ర‌మంలో పేషెంట్ల‌కు కొత్త మెడిసిన్ ఇచ్చారు. అయితే మెడిసిన్ తీసుకోగానే పేషెంట్ల‌కు ఓ వింత వ్యాధి వ‌చ్చింది. దీని కార‌ణంగా వారు రోజూ ఎవ‌ర్నో ఒక‌ర్ని ఒక‌సారి కొరక‌డం మొద‌లు పెట్టారు. ఈ సైడ్ ఎఫెక్ట్ వారం పాటు ఉండి త‌రువాత మాయం అయింది. చివ‌ర‌కు అంద‌రు పేషెంట్లు మామూలు అయ్యారు. అయితే డాక్ట‌ర్ ఒక్క విష‌యం గ‌మ‌నించాడు. ఒక్కో పేషెంట్‌కు 2 క‌రిచిన గాట్లు ఉండ‌గా, డాక్ట‌ర్‌కు మాత్రం 100 క‌రిచిన గాట్లు ఏర్ప‌డ్డాయి. దీన్ని బ‌ట్టి ఆలోచిస్తే అస‌లు హాస్పిట‌ల్‌లో ఎంద‌రు పేషెంట్లు ఉన్న‌ట్టు ?

can you solve these 5 puzzles

2. ఒక సైకియాట్రీ హాస్పిట‌ల్ లో ఒక డాక్ట‌ర్ ఓ పేషెంట్‌కు ఒక్కోటి 3 లింక్‌లు ఉన్న మొత్తం 5 చెయిన్ల‌ను ఇచ్చాడు. వాటిల్లో కేవ‌లం 3 లింక్‌లను మాత్ర‌మే విడ‌గొట్ట‌వ‌చ్చు, క‌ల‌ప‌వ‌చ్చు అని చెప్పాడు. అలా ఆ లింక్‌ల‌ను ఉప‌యోగించి మొత్తం 5 చెయిన్ల‌ను క‌లిపితే అత‌న్ని ఇంటికి పంపిస్తాన‌ని డాక్ట‌ర్ చెప్పాడు. దీంతో ఆ పేషెంట్ చేసి చూపించాడు. ఎలాగో తెలుసా..?

3. ఒక ప‌ట్ట‌ణంలో పేరు గాంచిన గ‌డియారాల వ్యాపారి ఉన్నాడు. అత‌నికి గ‌డియారాల‌ను అమ్మ‌డమే కాదు, అత్యంత విలువైన గ‌డియారాల‌ను త‌యారు చేయ‌డం కూడా తెలుసు. అందులో భాగంగానే అత్య‌ధిక ఎక్కువ ధ‌ర క‌లిగిన, అద్భుత‌మైన ఓ గ‌డియారాన్ని త‌యారు చేశాడు. ఆ విష‌యం తెలుసుకున్న ఆ ప‌ట్ట‌ణంలోని ధ‌నికులు ఆ గ‌డియారాన్ని కొనాల‌ని చూశారు. కానీ వ్యాపారి మాత్రం ఎవ‌రికీ ఆ విలువైన గ‌డియారాన్ని అమ్మ‌లేదు. కాక‌పోతే తాను అడిగే ప్ర‌శ్న‌ను సాల్వ్ చేస్తే ఆ గ‌డియారం ఉచితంగానే ఇస్తాన‌న్నాడు. త‌న ద‌గ్గ‌ర ఉన్న 9 గ‌డియారాల‌ను 10 వ‌రుస‌ల్లో పెట్టాలి. ఒక్కో వ‌రుస‌లో 3 గ‌డియారాలు ఉండాలి. అని అన్నాడు. దీంతో ఓ యువ‌కుడు ఆ ప‌జిల్‌ను సాల్వ్ చేసి ఎంచ‌క్కా విలువైన గ‌డియారాన్ని సొంతం చేసుకున్నాడు. అది ఎలా సాధ్య‌మ‌వుతుంది ?

4. ఒక సూప‌ర్ మార్కెట్‌లో జ‌న‌వ‌రి, ఏప్రిల్‌, జూన్ నెలల్లో ఒక్కో నెలా ఒక్కో దొంగ‌త‌నం జ‌రిగింది. అదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యింది. కానీ.. దొంగ ఎవ‌రో తేల్చ‌లేక‌పోయారు. చివ‌ర‌కు ఓ సెక్యూరిటీ గార్డు మాత్రం పైన చిత్రాల‌ను సునిశితంగా ప‌రిశీలించి దొంగ‌ను ప‌సిగట్టాడు. అది ఎలాగో తెలుసా..?

5. ఒక సైకియాట్రీ హాస్పిట‌ల్‌లో పెయింటింగ్ వ‌ర్క్ జ‌రుగుతోంది. పెయింట్ వ‌ల్ల ఎలాంటి హాని ఉండ‌ద‌ని, అది నాన్ టాక్సిక్ అని తెలియ‌డంతో పెయింట‌ర్ వ‌ద్ద‌కు పేషెంట్లు వెళ్లి అత‌ను చేస్తున్న ప‌నిని గ‌మ‌నించ‌వ‌చ్చ‌ని చెప్పారు. దీంతో ఓ యువ పేషెంట్ స్టాండ్‌పై నిలుచుని పెయింటింగ్ వేస్తున్న ఓ పెయింట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి ఇలా అడుగుతాడు. నువ్వు బ్ర‌ష్ గ‌ట్టిగానే ప‌ట్టుకుని పెయింటింగ్ వేస్తున్నావా? అని పేషెంట్ అడ‌గ్గా.. అందుకు పెయింట‌ర్ బ‌దులు చెబుతూ.. అవును.. ఎందుకు ? అంటాడు. అప్పుడు పెయింట‌ర్ అలా అన‌గానే పేషెంట్ ఏం చెప్పాడో, ఏం చేశాడో గెస్ చేయండి ?

వీటికి స‌మాధానాల‌ను త‌రువాతి పోస్ట్‌లో ఇస్తాం. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శ్న‌ల‌ను సాల్వ్ చేసేందుకు ప్ర‌య‌త్నించండి.

Admin

Recent Posts