హెల్త్ టిప్స్

Coriander Leaves Juice : కొత్తిమీర ఆకుల ర‌సాన్ని రోజూ తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Coriander Leaves Juice : సాధారణంగా మనలో అధిక శాతం మంది కొత్తిమీర ఆకులను నిత్యం పలు కూరల్లో వేస్తుంటారు. అయితే కూరల్లో వేసే ఈ ఆకులను కొందరు తింటారు కానీ.. కొందరు వాటిని తినేందుకు అంత ఆసక్తి చూపించరు. నిజానికి కొత్తిమీర ఆకులను పారేయకూడదు. వాటిని తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నిత్యం కొత్తిమీర ఆకుల రసాన్ని తాగితే మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తిమీర ఆకుల రసాన్ని తాగడం వల్ల శరీరంలో ఉత్పన్నమయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌ నశిస్తాయి. దీంతో శరీర కణజాలం రక్షింపబడుతుంది. డయాబెటిస్‌, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కొత్తిమీర ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. వాపులు కూడా తగ్గుతాయి. డయాబెటిస్‌ ఉన్న వారు కొత్తిమీర ఆకుల రసాన్ని నిత్యం తాగితే వారి షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

Coriander Leaves Juice many wonderful health benefits

కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. లివర్‌ సమస్యలు ఉన్నవారు కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ తాగుతుంటే ఆయా సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే శరీర మెటబాలిజం కూడా పెరిగి జీవక్రియలు సరిగ్గా నిర్వహింపబడతాయి. గుండె జబ్బులు ఉన్నవారు ఈ రసాన్ని తాగితే భవిష్యత్తులో మళ్లీ ఆ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే హైబీపీ తగ్గుతుంది.

అజీర్ణం ఉన్నవారు, ఫుడ్‌ పాయిజనింగ్‌ అయినవారు, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు, అలర్జీలు ఉన్నవారు, చర్మంపై దద్దుర్లు, గాయాలు అయినవారు కొత్తిమీర ఆకుల రసం తాగితే ఫలితం ఉంటుంది. కొత్తిమీర ఆకుల రసం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. కంటి సమస్యలు పోతాయి.

Admin

Recent Posts