పోష‌కాహారం

Apricots : వీటిని గుప్పెడు తింటే చాలు.. బీపీ ఎంత ఉన్నా సరే దిగి వ‌స్తుంది..!

Apricots : హైప‌ర్ టెన్ష‌న్ లేదా హై బ్ల‌డ్ ప్రెష‌ర్‌.. ఎలా పిలిచినా స‌రే.. ఈ స‌మ‌స్య ప్ర‌స్తుత త‌రుణంలో కామ‌న్ అయిపోయింది. చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా హైబీపీ వ‌స్తోంది. హైబీపీ వ‌చ్చిన వారిలో ర‌క్త‌నాళాల్లో గోడ‌ల‌కు ర‌క్తం ఎక్కువ పీడ‌నంతో పంప్ అవుతుంది. దీంతో దీర్ఘ‌కాలంలో ఈ స‌మ‌స్య వ‌ల్ల ర‌క్త‌నాళాలు దెబ్బ తింటాయి. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్ లేదా గుండె జ‌బ్బులు వ‌స్తాయి. దీనివ‌ల్ల ప్రాణాపాయ ప‌రిస్థితులు సంభ‌విస్తాయి. అయితే హైబీపీ స‌మ‌స్య వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి.

నిత్యం ఒత్తిడి, ఆందోళ‌న ఎక్కువ‌గా ఉండ‌డం, స‌రైన టైముకు తిండి తిన‌క‌పోవ‌డం, స‌రిగ్గా నిద్రించ‌కపోవ‌డం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం అలాగే ఉప్పును అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా హైబీపీ వ‌స్తుంది. చాలా మంది డాక్ట‌ర్లు కూడా హైబీపీ స‌మస్య‌కు ఉప్పును అధికంగా తీసుకోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెబుతుంటారు. అందువ‌ల్ల ఉప్పును త‌గ్గించాల‌ని సూచిస్తుంటారు. ఉప్పు ఎక్కువైతే శ‌రీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో ర‌క్త‌నాళాల్లో నీరు చేరుతుంది. ఇలా ర‌క్త నాళాల్లో నీరు చేర‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డి బీపీ పెరుగుతుంది. ఈ విధంగా ఉప్పు ఎక్కువ అవ‌డం వ‌ల్ల అన‌ర్థం జ‌రుగుతుంది.

take a handful of apricot to reduce high blood pressure

అయితే ర‌క్త‌నాళాల్లో ఎక్కువ‌గా ఉండే సోడియంను బ‌య‌ట‌కు పంపేందుకు పొటాషియం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. పొటాషియం ఉండే ఆహారాల‌ను గ‌న‌క మ‌నం రోజూ తింటే మ‌న ర‌క్త నాళాల్లో ఉండే సోడియం మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పోతుంది. అందువ‌ల్ల పొటాషియం అధికంగా ఉండే ఆహారాల‌ను తినాలి. ఇక బీపీ స‌మ‌స్య ఉన్న‌వారిని అర‌టి పండ్లు ఎక్కువ‌గా తినాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే అర‌టి పండ్ల‌లో పొటాషియం స‌మృద్ధిగా ఉంటుంది. ఒక 100 గ్రాముల అర‌టి పండును గ‌నుక మ‌నం తింటే మ‌న‌కు దాదాపుగా 300 మిల్లీ గ్రాముల మేర పొటాషియం ల‌భిస్తుంది. అందువ‌ల్ల బీపీ ఎక్కువ‌గా ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తింటే వెంట‌నే బీపీ అదుపులోకి వ‌చ్చేస్తుంది.

ఇక అర‌టి పండు క‌న్నా యాప్రికాట్‌ల‌లో పొటాషియం 3 రెట్లు ఎక్కువ‌గా ఉంటుంది. 100 గ్రాముల మేర యాప్రికాట్ల‌ను తింటే సుమారుగా 1162 మిల్లీగ్రాముల మేర పొటాషియం ల‌భిస్తుంది. అందువ‌ల్ల గుప్పెడు యాప్రికాట్‌ల‌ను తింటే బీపీ వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది. ఇలా ఈ రెండు ర‌కాల పండ్ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీ ఉన్న‌వారు చింతించాల్సిన ప‌నిలేదు. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఈ పండ్ల ద్వారా ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. క‌నుక అన్నివిధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Admin

Recent Posts