Carrot Soup : రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే క్యారెట్ సూప్ తయారీ.. ఈ సీజ‌న్‌లో తీసుకోవాల్సిందే..!

Carrot Soup : వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. అనేక ర‌కాల వ్యాధుల‌ను మోసుకు వ‌స్తుంది. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ద‌గ్గు, జ‌లుబు, విష జ్వ‌రాలు వ‌స్తుంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తి కూడా త‌గ్గిపోతుంది. క‌నుక ఇలాంటి స‌మ‌యంలో మనం రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో క్యారెట్లు కూడా ఒక‌టి. క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తుంది. క‌నుక క్యారెట్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా రోజూ తీసుకోవాలి.

అయితే క్యారెట్ల‌ను కొంద‌రు నేరుగా తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. వీటిని రోజూ తిన‌లేక‌పోతుంటారు. అలాంటి వారు క్యారెట్లతో ఎంతో రుచిగా ఉండే సూప్‌ను త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పైగా మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఇవ‌న్నీ మ‌న‌ల్ని ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక క్యారెట్ల‌తో సూప్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Carrot Soup for immunity recipe in telugu
Carrot Soup

క్యారెట్ సూప్ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ – 1 (స‌న్న‌గా త‌ర‌గాలి), క్యారెట్లు – 2 (స‌న్న‌గా త‌ర‌గాలి), నీళ్లు – 4 క‌ప్పులు, ఉల్లికాడ‌లు – 1 టీస్పూన్ (త‌రిగిన‌వి), ఉప్పు – అర టీస్పూన్‌, న‌ల్ల మిరియాలు – పావు టీస్పూన్‌, క్రీమ్ – పావు క‌ప్పు.

క్యారెట్ సూప్‌ను త‌యారు చేసే విధానం..

స్ట‌వ్ మీద పాన్ పెట్టి మీడియం మంట‌పై ఉంచి నూనె పోయాలి. నూనె కాగాక ఉల్లిపాయ‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ‌లు మెత్త‌గా అయ్యాక క్యారెట్లు, నీళ్లు, ఉల్లికాడలు, ఉప్పు, మిరియాలు వేయాలి. అన్నింటినీ బాగా మ‌రిగించాలి. స్ట‌వ్‌ను 30 నిమిషాల పాటు సిమ్‌లో ఉంచి బాగా మ‌రిగించాలి. దీంతో క్యారెట్లు మెత్త‌గా మారుతాయి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని బ్లెండ‌ర్‌లో వేసి మెత్త‌ని సూప్‌లా ప‌ట్టుకోవాలి. అనంత‌రం క్రీమ్ వేసి క‌ల‌పాలి. దీంతో వేడి వేడి క్యారెట్ సూప్ రెడీ అవుతుంది. ఇందులో రుచి కోసం నిమ్మ‌ర‌సం, తేనె క‌లుపుకోవ‌చ్చు. ఇలా క్యారెట్ సూప్‌ను త‌యారు చేసుకుని ఈ సీజ‌న్‌లో తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి.

Share
Editor

Recent Posts