Chandravankalu : ఎంతో తియ్య‌ని చంద్ర‌వంక‌లు.. ఎప్పుడైనా తిన్నారా.. ఒక‌సారి తింటే మ‌ళ్లీ కావాలంటారు..

Chandravankalu : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో చంద్ర‌వంక‌లు ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. తియ్య‌టి రుచితో మెత్త‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత చ‌క్క‌గా ఈ చంద్ర‌వంక‌లు ఉంటాయి. వీటిని మ‌నం ఇంట్లో కూడా చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువగా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. రుచిగా, చ‌క్క‌గా చంద్ర‌వంక‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్ర‌వంక‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ‌పిండి – ఒక క‌ప్పు, వంట‌సోడా – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, బెల్లం తురుము – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Chandravankalu recipe in telugu very delicious sweet
Chandravankalu

చంద్ర‌వంక‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, వంట‌సోడా వేసి క‌లుపుకోవాలి. త‌రువాత రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనెను వేసి క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో లేదా క‌ళాయిలో బెల్లం, నీళ్లు పోసివేడి చేయాలి. ఇందులోనే యాల‌కుల‌ల పొడి కూడా వేసుకోవాలి. బెల్లం క‌రిగి కొద్దిగా జిగురుగా అయిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి దీనిపై మూత‌ను ఉంచి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని మ‌రోసారి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత పిండిని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ అర ఇంచు మందంతో చ‌పాతీలా రుద్దుకోవాలి. త‌రువాత బాటిల్ మూత‌ను లేదా అంచు ప‌దునుగా ఉండే గిన్నెను లేదా గ్లాస్ ను తీసుకుని అంచుల‌కు కొద్దిగా పొడి పిండి రాసుకుంటూ పిండిని చంద్ర‌వంక‌ ఆకారంలో క‌ట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని క‌ట్ చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి.

అలాగే పాకాన్ని కూడా కొద్దిగా వేడి చేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి చంద్రవంక‌ల‌ను నూనెలో వేసుకోవాలి. వీటిని చిన్న మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. త‌రువాత వీటిని తీసి వేడిగా ఉన్న బెల్లం మిశ్ర‌మంలో వేసుకోవాలి. వీటిని 15 నుండి 30 నిమిషాల పాటు బెల్లం మిశ్ర‌మంలో ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చంద్ర‌వంక‌లు త‌యార‌వుతాయి. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు, పండుగ‌ల‌కు ఇలా చంద్ర‌వంక‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. గోధుమ పిండి, బెల్లాన్ని ఉప‌యోగిస్తున్నాం క‌నుక వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎటువంటి హాని క‌ల‌గ‌దు.

D

Recent Posts