Underarm Darkness : కొందరిలో శరీరమంతా తెల్లగా ఉన్నప్పటికి చంకల భాగంలో చర్మం నల్లగా ఉంటుంది. సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల, చంక భాగాలపై తగినంత శ్రద్ధ పెట్టకపోవడం వల్ల, ఎండలో ఎక్కువగా తిరగడం , డియో డ్రెంట్ లను ఎక్కువగా వాడడం వంటి రకరకాల కారణాల వల్ల చంక భాగంలో చర్మం నల్లగా అవుతుంది. ఇలా చర్మం నల్లగా మారడం వల్ల ఎటువంటి సమస్య లేకపోయిన నచ్చిన దుస్తులు ధరించకలేక అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ఒక చిన్న ఇంటి చిట్కాను ఉపయోగించి చంక భాగంలో నలుపును సులభంగా తొలగించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల నలుపుదనం తొలగిపోవడంతో పాటు దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీనిని తయారు చేసుకోవడానికి గానూ మనం కొబ్బరి నూనెను, ఉప్పును, తెల్ల రంగులో ఉండే టూత్ పేస్ట్ ను, నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. వీటిని ఉపయోగించి చంకలో ఉండే నలుపుదనాన్ని, దుర్వాసనను ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకోవాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ ఉప్పును, కొద్దిగా టూత్ పేస్ట్ ను వేసుకోవాలి. తరువాత వీటిని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసి ఒక ముక్కను తీసుకోవాలి. ఈ నిమ్మకాయ ముక్కతో ముందుగా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని తీసుకుని చంక భాగంలో చర్మం పై వృత్తాకారంలో నెమ్మదిగా, సున్నితంగా రుద్దుకోవాలి. దీనిలో ఉపయోగించిన ఉప్పు మనకు స్క్రబర్ లా పని చేసి చర్మం పై ఉండే మృత కణాలను తొలగిస్తుంది.
కొబ్బరి నూనె చర్మానికి మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. నిమ్మకాయలో అలాగే టూత్ పేస్ట్ లో ఉండే బ్లీచింగ్ ఏజెంట్ లు చర్మాన్ని తెల్లగా మార్చడంలో సహాయపడతాయి. 15 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను వారినికి రెండు సార్లు క్రమం తప్పకుండా వాడడం వల్ల కొద్ది రోజుల్లోనే చంక భాగంలో చర్మం తెల్లగా మారుతుంది. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల చంకల నుండి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. చంక భాగంలో చర్మం నల్లగా ఉన్న వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.