Chepala Iguru : చేపల ఇగురును చేయడం చాలా సులభమే.. ఎంతో రుచిగా ఉంటుంది..

Chepala Iguru : సాధారణంగా చేపలను ఎంతో మంది ఇష్టంగా తింటుంటారు. చికెన్‌, మటన్‌ కన్నా చేపలు అంటే ఇష్టపడే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. మాంసం ఉత్పత్తుల్లో చేపలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటిల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అయితే చేపలతో పులుసు, వేపుడు మాత్రమే కాకుండా ఇగురును కూడా చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. కాస్త ఓపిగ్గా చేస్తే చేపల ఇగురు ఎంతో రుచిగా రెడీ అవుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చేపల ఇగురు తయారీకి కావల్సిన పదార్థాలు..

చేప ముక్కలు – అర కిలో, ఉల్లిపాయలు – నాలుగు, పచ్చి మిర్చి – ఆరు, కారం – రెండు టీస్పూన్లు, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్‌, ధనియాల పొడి – ఒక టీస్పూన్‌, పసుపు – ఒక టీస్పూన్‌, టమాటా – రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – ఒక టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు, నూనె – అర కప్పు, ఉప్పు – తగినంత.

Chepala Iguru it is very easy to make this dish at home
Chepala Iguru

చేపల ఇగురును తయారు చేసే విధానం..

ముందుగా చేప ముక్కల్ని కడిగి వాటికి అర టీస్పూన్‌ చొప్పున పసుపు, ఉప్పు, కారం పట్టించి అరగంట సేపు నానబెట్టాలి. తరువాత కాగిన నూనెలో ముక్కల్ని వేయించి తీయాలి. అదే బాణలిలో మిగిలిన నూనెలో ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగాక జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేగనివ్వాలి. తరువాత టమాటా ముక్కలు, ఉప్పు వేసి నూనె బయటకు వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. వేయించిన చేప ముక్కలు వేసి సుమారుగా పది నిమిషాల పాటు దగ్గరగా అయ్యేవరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లితే చాలు. ఎంతో రుచిగా ఉండే చేపల ఇగురు రెడీ అవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా అన్నంతో కలిపి తినవచ్చు. ఇతర కూరలతో కలిపి అంచుకు పెట్టుకుని కూడా తినవచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts