Hair Growth Tips : ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేశారంటే.. నెల రోజుల్లోనే మీ జుట్టు ఎంతో పొడ‌వుగా పెరుగుతుంది..

Hair Growth Tips : జుట్టును సంరక్షించుకోవ‌డం కోసం చాలా మంది ఎన్నో ర‌కాల షాంపుల‌ను, నూనెల‌ను, హెయిర్ కండిష‌న‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు కూడా చేస్తూ ఉంటారు. కానీ మ‌న ఇంట్లో ఉండే ఉల్లిపాయ జుట్టు స‌మ‌స్య‌ల‌కు దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. కురుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఉల్లిపాయ దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుందని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం అవ‌స‌రం లేదు. దీనిని ఉప‌యోగించిన త‌రువాత వ‌చ్చిన ఫ‌లితాల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌ద‌ని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయ జుట్టు రాల‌డాన్ని అరిక‌డుతుంది. దీనిలో ఉండే ఘాటైనా స‌ల్ఫ‌ర్ జుట్టు పెర‌గ‌డానికి ఎంతో స‌హాయ‌ప‌డుతుంది మ‌రియు జుట్టు రాల‌డాన్ని పూర్తిగా త‌గ్గిస్తుంది.

ఉల్లిపాయ‌లో ఉండే యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు చుండ్రును కూడా నివారిస్తాయి. జుట్టు రాల‌డాన్ని అరిక‌ట్టాల‌న్న‌, జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాల‌న్న ఉల్లిపాయ ర‌సాన్ని జుట్టుకు ప‌ట్టించాలి. ఉల్లిపాయ వాస‌న మ‌న‌కు ఇబ్బంది క‌లిగించిన దీనిని వాడడం మాత్రం మాన‌కూడ‌దు. జుట్టు పెరుగుద‌ల‌తో పాటు జుట్టు పోష‌ణ‌కు కూడా ఉల్లిపాయ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల జుట్టు అందంగా, ఒత్తుగా , బ‌లంగా త‌యార‌వుతుంది. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించి జుట్టు పెరిగేలా చేయాలంటే ఉల్లిపాయ ర‌సాన్ని జుట్టుకు ప‌ట్టించాల్సిందే. ఉల్లిపాయ ర‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Hair Growth Tips use onions in this way for better results
Hair Growth Tips

ముందుగా రెండు లేదా మూడు పెద్ద ప‌రిమాణంలో ఉండే ఉల్లిపాయ‌ల‌ను తీసుకుని ముక్క‌లుగా చేయాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను నీటిలో వేసి బాగా మ‌రిగించాలి. ఇలా మ‌రిగించిన నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ నీటిని రాత్రి ప‌డుకునే ముందు జుట్టుకు ప‌ట్టించి మ‌ర్దనా చేయాలి. మ‌రుస‌టి రోజూ ఉద‌యాన్నే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల జుట్టు బ‌లంగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా త‌క్కువ ఖ‌ర్చులోనే అంద‌మైన‌, ఆరోగ్య‌వంత‌మైన, పొడ‌వాటి జుట్టును సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు రాల‌డం, చుండ్రు వంటి జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

Share
D

Recent Posts