Chinta Chiguru Chicken : పుల్ల పుల్ల‌గా ఎంతో కారంగా ఉండే చింత చిగురు చికెన్‌.. ఇలా చేయండి..!

Chinta Chiguru Chicken : చింత‌చిగురును కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చింత‌చిగురు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. సాధార‌ణంగా చింత‌చిగురుతో మ‌నం ప‌ప్పు, ప‌చ్చ‌డి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ చింత‌చిగురుతో మ‌నం చింత‌చిగురు చికెన్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చింత‌చిగురు చికెన్ పుల్ల పుల్ల‌గా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చింత‌చిగురు ల‌భించే కాలంలో ఇలా చింత‌చిగురు చికెన్ ను త‌యారు చేసుకుని రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చింత చిగురు చికెన్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చింత‌చిగురు చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – ముప్పావు కిలో, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – ఒక టీ స్పూన్, పెరుగు- ఒక క‌ప్పు, నూనె – 2 టీ స్పూన్స్, చింత‌చిగురు – ఒక పెద్ద కప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – రెండు టీ స్పూన్స్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్.

Chinta Chiguru Chicken recipe in telugu very tasty easy to make
Chinta Chiguru Chicken

చింత‌చిగురు చికెన్ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ను ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో ఉప్పు, కారం, పెరుగు, నూనె వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత గిన్నెలో చింత‌చిగురును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత దీనిని చిన్న‌గా క‌ట్ చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని రెండు నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి చికెన్ ను మెత్త‌గా ఉడికించాలి. త‌రువాత క‌ట్ చేసుకున్న చింత‌చిగురును వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చింత‌చిగురు చికెన్ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన చికెన్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts