Anasuya : యాంకర్‌గానే కాదు.. నటిగా కూడా రాణిస్తున్న అనసూయకు ఈ మధ్య సినిమా అవకాశాలు ఎక్కువైపోయాయి. పుష్ప సినిమాలో దాక్షాయణిగా ఈమె అలరించింది. త్వరలోనే ఈ మూవీ రెండో పార్ట్‌లోనూ ఈమె నటించనుంది. ఇక రవితేజ ఖిలాడి సినిమాలోనూ ఈమె కనిపించి ఆకట్టుకుంది. అయితే మెగాస్గార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలోనూ ఓ కీలకపాత్రలో అనసూయ నటిస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్యే ఈమెకు చెందిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ సినిమాలోనే అనసూయ పాత్రకు చిరంజీవి పాత్ర వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గాడ్‌ఫాదర్ సినిమాలో చిరంజీవిని దెబ్బ తీసేందుకు కొందరు ప్రత్యర్థులు అనసూయ నడిపే చానల్‌కు చేరుకుంటారు. ఆమె చానల్ సమస్యల్లో ఉంటుంది. చిరంజీవికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసి అతన్ని జైల్లో వేస్తే ఆమెకు సహాయం చేస్తామని వారు మాటిస్తారు. దీంతో సినిమాలో అనసూయ పాత్ర అలాగే చేస్తుంది. కానీ తీరా అంతా సవ్యంగానే జరిగాక వారు ఆమెను మోసం చేస్తారు.
ఈ క్రమంలోనే జైలు నుంచి బయటకు వచ్చే చిరంజీవి పాత్ర ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. అంతేకాదు ఆమెకు సహాయం చేస్తాడు. తాను చెప్పింది చేయాలని చెబుతాడు. ఇదీ.. అసలు జరిగిన విషయం. ఈ క్రమంలోనే నిజంగానే చిరంజీవి అనసూయకు వార్నింగ్ ఇచ్చారేమోననే వార్త వైరల్ అవుతోంది. దీన్ని కొందరు వైరల్ చేస్తున్నారు.