Viral Video : అడవికి రాజు సింహం. దాన్ని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. ఎంతటి జంతువు అయినా సరే సింహాన్ని చూస్తే జడుసుకుంటుంది. అందుకనే సింహాన్ని అడవికి రాజు అంటుంటారు. అయితే అక్కడ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జరిగింది. గేదెలను చూసి భయపడిన సింహం చెట్టెక్కింది. అవును.. నిజమే.. కావాలంటే కింద ఇచ్చిన వీడియోను చూడవచ్చు.
అడవిలో కొన్ని గేదెల గుంపు వస్తుండగా.. అక్కడే ఉన్న ఓ సింహం చెట్టెక్కి కూర్చుంది. అవి పోయే వరకు అక్కడే ఉంది. దీంతో ఆ సమయంలో తీసిన వీడియోను షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గేదెలను చూసి సింహం భయపడేసరికి ఆ వీడియోను చాలా మంది చూస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఆ వీడియోకు అనేక కామెంట్లు పెడుతున్నారు.
అయితే నిజంగానే సింహం చెట్టు ఎక్కిందా.. లేక ఇది గ్రాఫిక్స్‌లో చేసిన వీడియోనా.. అని కొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ వీడియోను చూసి మాత్రం చాలా మంది తెగ ఎంజాయ్ చేస్తున్నారు.