Coolness In Home : మండే ఎండల నుండి ఉపశమనాన్నిపొందడానికి ప్రజలు ఇంట్లో ఏసీలు, కూలర్ లు, ఫ్యాన్లను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఇంటి లోపల చల్లగా ఉన్నప్పటికి తరుచూ వీటిని వాడడం వల్ల కరెంట్ బిల్ ఎక్కువగా రావడంతో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటిని వాడడం వల్ల ఇంట్లో ఉండే పిల్లలకు, పెద్దలకు మరిన్ని సమస్యలు రావచ్చు. అయితే పూర్వకాలంలో ఇండ్లల్లో ఫ్యాన్లు కానీ, ఏసీలు, కూరల్ లు కానీ ఏవీ లేవు. కానీ ఇంటి లోపల చాలా చల్లగా ఉండేది. కనుక మనం కూడా ఏసీ, కూలర్ లకు బదులుగా ఇంటిని చల్లగా ఉంచే కొన్ని సహజ సిద్ద పద్దతులను ఉపయోగించడం మంచిది. చాలా మంది ఎంతో కాలంలో ఈ పద్దతులను అనుసరిస్తున్నారు కూడా.
వేసవి కాలంలో సహజంగా ఇంటిని చల్లగా ఉండే పద్దతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో ఇంటిని చల్లగా ఉంచే మార్గాలల్లో ఖుస్ మత్ ఒకటి. ఖుస్ చెక్కతో తయారు చేసిన చాపను ఇంటి తలుపులకు వెళాడదీయాలి. ఇంట్లోకి సూర్యరశ్మి వచ్చే చోట, వెంటిలేషన్ ఎక్కువగా ఉండే చోట ఈ చాపలను కర్టెన్ లాగా వెలాడదీయాలి. అలాగే వీటిపై అప్పుడప్పుడూ నీటిని చల్లుతూ ఉండాలి. ఇది ఇంటిని చల్లగా ఉంచడంతో పాటు గసగసాల వాసన ఇంట్లో మానసిక స్థితిని కూడా పెంచుతుంది. అలాగే ఇంటి లోపల చల్లగా ఉండాలంటే వెంటిలేషన్ ఎక్కువగా ఉండడంమంచిది. వెంటిలేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్లోకి గాలి ఎక్కువగా వస్తుంది. గదిలో తేమ లేకుండా ఉంటుంది. అలాగే గదిలో పెద్ద వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఇవి గాలి ప్రవాహాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. అలాగే ఈ వస్తువులు ఉండడం వల్ల గదిలో వేడిగా ఉన్నట్టు ఉంటుంది. అలాగే వేసవికాలంలో ముదురు రంగు కర్టెన్లకు, బెడ్ షీట్ లకు బదులుగా లేత రంగు కర్టెన్లను వాడడం మంచిది. అలాగే మందపాటి కర్టెన్లను వాడడం మంచిది. ఇక వేసవికాలంలో ఇంటి పైకప్పుపై తెల్ల పెయింట్ వేయడం మంచిది.
తెలుపు రంగు వేడిని ఎక్కువగా గ్రహించదు. దీంతో ఇంటి లోపల ఎక్కువగా వేడి అవ్వకుండా ఉంటుంది. మనకు మార్కెట్ లో అనేక రకాల పెయింట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడడం వల్ల ఇంటి లోపల కొంతమేర చల్లగా ఉంటుంది. అలాగే ఇంటి ప్రాంగణంలో పెద్ద చెట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అయితే నేటి తరుణంలో ఇండ్లు చాలా చిన్నగా అయిపోయాయి. కనుక మీ ఇంటి బాల్కనీలో వీలైనన్ని చెట్లు ఉండేలా చూసుకోవాలి. దీంతో ఇంట్లోకి చల్లటి గాలి ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా తగిన పద్దతులను పాటించడం వల్ల ఫ్యాన్లు, కూలర్ లను వాడే అవసరం లేకుండా పోతుంది. ఈ పద్దతులను పాటించడం వల్ల వేసవికాలంలో కూడా ఇంట్లో చల్లగా ఉంటుంది.