Dhaba Style Dal : ధాబా స్టైల్‌లో ఎంతో టేస్టీగా ఉండే దాల్‌ను ఇలా చేయండి.. రోటీలు, అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Dhaba Style Dal : ధాబా దాల్ .. మిన‌ప‌ప్పుతో చేసే ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువ‌గా ధాబాల‌ల్లో త‌యారు చేస్తూ ఉంటారు. రొట్టె, చ‌పాతీ, జొన్న రొట్టె వంటి వాటితో ఈ ప‌ప్పును తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగ ఈ ప‌ప్పు చాలా బ‌ల‌వ‌ర్ద‌కం అని చెప్ప‌వ‌చ్చు. ఈ దాల్ ను తీసుకోవ‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. పిల్ల‌ల‌కు ఈ ప‌ప్పును పెట్ట‌డం వ‌ల్ల వారు మరింత బ‌లంగా త‌యార‌వుతార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ధాబా దాల్ ను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ ప‌ప్పును, రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ ధాబా దాల్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ధాబా దాల్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

4 గంట‌ల పాటు నాన‌బెట్టిన బ‌ద్ద‌ల మిన‌ప‌ప్పు – అర క‌ప్పు, ప‌సుపు – కొద్దిగా, ఉప్పు – కొద్దిగా, నీళ్లు – 2 క‌ప్పులు, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, సోంపు – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, జాప‌త్రి – కొద్దిగా, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి త‌రుగు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ట‌మాట ఫ్యూరీ – ముప్పావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.

Dhaba Style Dal recipe better taste with rice or roti
Dhaba Style Dal

ధాబా దాల్ త‌యారీ విధానం..

ముందుగా నాన‌బెట్టిన పప్పును కుక్క‌ర్ లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, ప‌సుపు, నీళ్లు పోసి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 7 నుండి 8 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. ఇప్పుడు క‌ళాయిలో దాల్చిన చెక్క‌, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, సోంపు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని ఇందులో జాప‌త్రి, కారం, ఉప్పు, ప‌సుపు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, అల్లం, వెల్లుల్లి త‌రుగు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ఉడికించిన ప‌ప్పును నీటితో స‌హా వేసుకోవాలి. దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 7 నుండి 8 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత పావు లీట‌ర్ నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని 3 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 3 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ధాబా దాల్ త‌యార‌వుతుంది. దీనిని రోటీ, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మిన‌ప‌ప్పుతో ప‌ప్పును త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts