Davanagere Benne Dosa : ఫేమ‌స్ దావ‌ణ‌గెరె బెన్నె దోశ‌.. త‌యారీ ఇలా.. కొబ్బ‌రి చ‌ట్నీతో తింటే రుచి అదిరిపోతుంది..!

Davanagere Benne Dosa : బెన్నె దోశ‌.. క‌ర్ణాట‌క స్పెష‌ల్ అయిన ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశ త‌యారీలో నూనెను వాడ‌కండా కేవ‌లం వెన్న‌ను మాత్ర‌మే ఉప‌యోగిస్తారు. చాలా మంది ఈ దోశ‌ను ఇష్టంగా తింటారు. ఈ బెన్నె దోశ‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌ర‌చూ ఒకేర‌కం దోశ‌ను కాకుండా అప్పుడ‌ప్పుడూ ఇలా బెన్నె దోశ‌ను కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. బెన్నె దోశ‌ను దానిలోకి స్సైసీ కొబ్బ‌రి చ‌ట్నీని అలాగే దీనిని తిన‌డానికి పాల్యాను ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెన్నె దోశ తయారీకి కావల్సిన ప‌దార్థాలు..

దోశ బియ్యం – ఒక‌టిన్న‌ర క‌ప్పు, మిన‌ప‌ప్పు – అర క‌ప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, దొడ్డు అటుకులు – అర క‌ప్పు, బియ్యం పిండి – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, పంచ‌దార – ఒక టీ స్పూన్.

Davanagere Benne Dosa recipe in telugu make in this method
Davanagere Benne Dosa

పాల్యా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – ఒక క‌ప్పు, ఉప్పు -త‌గినంత‌, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, ప‌సుపు -చిటికెడు, ఉడికించి మెత్త‌గా చేసిన బంగాళాదుంప‌లు – 2, వెన్న – ఒక టేబుల్ స్పూన్.

స్పైసీ కొబ్బ‌రి చ‌ట్నీ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – ఒక క‌ప్పు, నూనెలో వేయించిన ప‌చ్చిమిర్చి – 10, అల్లం – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 2, యాల‌కులు – 2, దాల్చిన చెక్క – ఒక ముక్క‌, ఉప్పు – త‌గినంత‌, చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, నీళ్లు – కొద్దిగా.

బెన్నె దోశ తయారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో బియ్యం, మిన‌ప‌ప్పు, అటుకులు,మెంతులు వేసి 6 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి చ‌ల్ల‌టి నీళ్లు పోస్తూ మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత పిండిని గిన్నెలో తీసుకుని అందులో బియ్యం పిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత‌మూత పెట్టి రాత్రంతా పిండిని పులియ‌బెట్టుకోవాలి. పిండి చ‌క్క‌గా పులిసిన త‌రువాత ఉప్పు, పంచ‌దార‌, త‌గిన‌న్ని నీళ్లు పోసుకుని పిండిని క‌లిపి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత జార్ లో చ‌ట్నీ కోసం ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌ను వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ట్నీ త‌యార‌వుతుంది. త‌రువాత క‌ళాయిలో పాల్యా కోసం నీళ్లు, ఉప్పు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఉడికించాలి.

ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత ప‌ప్పుగుత్తితో లేదా గంటెతో మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. తరువాత బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. దీనిని అంతా క‌లిసేలా కలుపుకున్న త‌రువాత వెన్న వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక నీళ్లు చల్లుకుని తుడుచుకోవాలి. త‌రువాత పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. దీనిని వెన్న వేస్తూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసిన దోశ‌ను పాల్యా, చ‌ట్నీతో స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెన్నె దోశ త‌యార‌వుతుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే దోశ కావాల‌ని అడుగుతారు.

D

Recent Posts