Besan For Beauty : శనగపిండిని ఉపయోగించి మనం మన ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని మీకు తెలుసా… నేటి తరుణంలో చాలా మంది మొటిమలు, మచ్చలు, ట్యాన్, చర్మంపై మృతకణాలు పేరుకుపోవడం, చర్మం ముడతలు పడడం ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ముఖ సౌంందర్యం తగ్గి అందవిహీనంగా కనబడతారు. ఈ సమస్యల కారణంగా చాలా మంది ఆత్మనూన్యతకు గురి అవుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వాతవరణ కాలుష్యం వంటి వాటి వల్ల మన ముఖం అందవిహీనంగా కనబడుతుంది. ఇటువంటి చర్మ సమస్యలతో బాధపడే వారు బయట లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ కు బదులుగా మన వంటింట్లో ఉండే శనగపిండిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
శనగపిండిని వాడడం వల్ల మొటిమలు, మచ్చలు, జిడ్డు పేరుకుపోవడం వంటి అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. శనగపిండిని వాడడం వల్ల మన ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. అయితే ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి శనగపిండిని ఎలా వాడాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ శనగపిండి, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగి వేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయి ముఖం తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది.
అలాగే మొటిమలు, మచ్చలు వంటి సమస్యలతో బాధపడే వారు ఒక గిన్నెలో ఒక స్పూన్ శనగపిండి, అర టీ స్పూన్ పెరుగు, అర టీస్పూన్ కలబంద గుజ్జు, అర టీ స్పూన్ కాఫీ పొడి, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి కలపాలి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గి ముఖం అందంగా తయారవుతుంది. అలాగే ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు వేసి కలపాలి. దీనిని నీళ్లు పోస్తూ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది. ఈ విధంగా శనగపిండిని ఉపయోగించడం వల్ల మనం మన ముఖాన్ని చాలా సులభంగా అందంగా, తెల్లగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు.