వినోదం

దేవ‌ర ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ నుండి వ‌స్తున్న చిత్రం దేవ‌ర‌. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘దేవర’ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆరు సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా నటించడంతో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా ఈ సినిమాలో నటించి తాను కూడా తెలుగు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాని రాజ‌మౌళితో పాటు మ‌రికొంత మంది స‌న్నిహితులకి స్పెష‌ల్ ప్రీమియ‌ర్ వేసిన‌ట్టు తెలుస్తుంది. అందరూ పాజిటివ్ గా స్పందించారు. ఈ సినిమాలో తారక్ కనపరిచిన నటనకు వారంతా ఫిదా అయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఔట్‌స్టాండింగ్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడని, అతడి హీరోయిజంకానీ, ఎలివేషన్స్ కానీ ఓ స్థాయిలో ఉన్నాయ‌ని ప్ర‌శంస‌లు కురిపించినట్టు తెలుస్తుంది.

తారక్ ఎలివేషన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయని, యాక్షన్ సన్నివేశాలను కొరటాల హాలీవుడ్ ను మించినస్థాయిలో తీశారంటున్నారు. మ‌రోవైపు మ్యూజిక్ సెన్సేసన్ అనిరుద్ రవిచందర్ పోస్ట్‌తో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. గ‌తంలో అనిరుధ్ రజినీకాంత్ “జైలర్” కి షారుఖ్ ఖాన్ తో చేసిన భారీ చిత్రం “జవాన్” కి అలాగే గత ఏడాదిలోనే వచ్చిన విజయ్ దళపతి సినిమా “లియో సినిమాలు రిలీజ్‌కి ముందు ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు పెట్టాడు. అవి ఎంత పెద్ద విజ‌యం సాధించాయో మ‌నం చూశాం. ఇప్పుడు దేవ‌ర రిలీజ్‌కి ముందు కూడా అనిరుధ్ పోస్ట్ పెట్ట‌డంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు.

మ‌రోవైపు కొంద‌రు డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా ఈ సినిమాని వీక్షించిన‌ట్టు తెలుస్తుండ‌గా, వారు దేవ‌ర ఫ‌స్ట్ హాఫ్ చాలా బాగుంద‌ని చెప్పార‌ట‌. యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ ను కలిగిస్తాయి అని తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ బాగుంటుందట. రివర్స్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుందని , త‌ర్వాత క్లైమాక్స్ పుంజుకుంటుందని అంటున్నారు. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్స్ సీక్వెన్స్..లు తెలుగు ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ ను కలిగిస్తాయి అని అంటున్నారు. మొత్తంగా దేవ‌ర చిత్రం ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించ‌డం ఖాయం అని చెబుతున్నారు.

Sam

Recent Posts