Dhaba Style Aloo Tomato Kura : ధాబా స్టైల్‌లో ఆలు, ట‌మాటా కూర‌ను ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి అదిరిపోతుంది..

Dhaba Style Aloo Tomato Kura : మ‌నం అప్పుడ‌ప్పుడూ ఇంట్లో ఆలూ ట‌మాట క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాం. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, పుల్కా, అన్నంతో క‌లిపి తిన‌డానికి ఈ కూర చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఈ కూర‌ను త‌యారు చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. ఈ ఆలూ ట‌మాట కూర‌ను మ‌రింత రుచిగా దాబాలో ల‌భించే విధంగా కూడా మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ ట‌మాట కూర‌ను మ‌రింత రుచిగా దాబా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దాబా స్టైల్ ఆలూ ట‌మాట క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), త‌రిగిన ట‌మాటాలు – 3, చిన్న ముక్క‌లుగా త‌రిగిన ఉల్లిపాయ – 1 ( పెద్ద‌ది), చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 2, యాల‌కులు – 2, బిర్యానీ ఆకు – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన మెంతికూర – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Dhaba Style Aloo Tomato Kura recipe in telugu very easy method
Dhaba Style Aloo Tomato Kura

దాబా స్టైల్ ఆలూ ట‌మాట క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత అర గ్లాస్ నీటిని పోసి మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ట‌మాట ముక్క‌లు ఉడికిన త‌రువాత బంగాళాదుంప‌ల‌ను మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా ముక్క‌లు ఉండేలా న‌లిపి వేసుకోవాలి. అలాగే మెంతికూర‌ను కూడా వేసి క‌ల‌పాలి.

ఇప్పుడు మ‌రో అర గ్లాస్ నీటిని పోసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే దాబా స్టైల్ ట‌మాట క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలారుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే ఆలూ ట‌మాట క‌ర్రీ కంటే ఇలా చేసిన ట‌మాట క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు.

D

Recent Posts