vastu

House Main Door : ఇంటి ద్వారం ద‌గ్గ‌ర ఇలా చేస్తే.. ఇంట్లోకి డ‌బ్బు వ‌ద్ద‌న్నా వ‌స్తుంది..!

House Main Door : ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో ధనము లేనిదే మానవ సంబంధాల‌కు కూడా విలువ లేకుండా పోతోంది. అలాంటి సంపదలకు అధిపతి లక్ష్మీదేవి. ఆమె కటాక్షం ఉన్నప్పుడే ఇంట్లో సిరి సంపదలు కొలువై ఉంటాయి. అలాంటి లక్ష్మీదేవి కటాక్షం మనకి కలగాలంటే ఇంటి ద్వారం దగ్గర కొన్ని నియమాల‌ను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కోసం మనం చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఎంత కష్టపడినా చివరకు ఇంట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. కానీ వర్క్ టెన్షన్స్, ఆర్థిక ఇబ్బందులు, మానసిక రుగ్మతలతో సరైన నిద్ర లేకుండా అశాంతికి లోనవుతారు. ఇలా అశాంతికి లోనవటం అనేది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీనికి కారణంగా ఇంట్లో లక్ష్మీదేవికి బదులు జ్యేష్టాదేవి కొలువై ఉండడం. మరి జ్యేష్టాదేవిని ఇంటి నుంచి బయటకు పంపి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలి అంటే మనం చెప్పుకునే ఈ పద్ధతి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

do like this at house main door to attract wealth into home

మనం మొదటిగా ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాం. లక్ష్మీ దేవిగా భావించి ఇంటి గుమ్మానికి మంగళవారం, శుక్రవారం పసుపు రాయడం వలన నెగెటివ్ ఎన‌ర్జీ అనేది బయటకు వెళ్లి లక్ష్మీదేవి ఇంటికి ఆహ్వానించబడుతుంది. అదేవిధంగా ఇంటి సింహ ద్వారం ఎదురుగా ఎటువంటి చెడు దృష్టి లోనికి రాకుండా బూడిద గుమ్మడి కాయను కట్టాలి. ఇలా కట్టడం వల్ల చెడు దృష్టి అనేది మన ఇంటిలో ప్రవేశించకుండా ఇంటిలో వారికి మానసిక ప్రశాంతతను, ఆరోగ్యం కలుగజేస్తుంది. ఎప్పుడైతే ఇంట్లోని వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారో లక్ష్మీ కృప ఎల్లవేళలా కలుగుతుంది.

గుమ్మడికాయలో జీవశక్తి ఉండడంవల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో రాకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే మనం కట్టిన గుమ్మడికాయ పదిహేను రోజుల లోపు కుళ్ళి పోతుందో దాన్నిబట్టి నరదృష్టి ఎంత ఉన్నదనే విషయం అర్థమవుతుంది. ఈ కుళ్ళిపోయిన‌ గుమ్మడికాయ స్థానంలో మరొక‌ గుమ్మడికాయను ప్రతిష్టించాలి. అదేవిధంగా కలబంద కూడా ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని రాకుండా అడ్డుకుంటుంది. ఎప్పుడైతే ఇంట్లోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిత్యం కొలువై ఉండి సిరిసంపదలను కలగజేస్తుంది. క‌నుక ఈ విధ‌మైన సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల ఇంట్లో ఎల్ల‌ప్పుడూ అంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉంటారు. ఆర్థిక స‌మస్య‌లు ఉండ‌వు.

Admin

Recent Posts