Coins : డబ్బంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. దీనిని ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచమంతా డబ్బు మీదే నడుస్తోంది. డబ్బు లేనిదే ప్రస్తుత కాలంలో ఏదీ జరగదు. అయితే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు సమృద్ధిగా ఉండదు. వారి ఖర్చులకు తగినంత సంపాదించుకోలేని వారు చాలా మందే ఉంటారు. మనం తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా మన దగ్గర డబ్బు ఉండదు. మనం తెలియక చేసే ఆ అతిపెద్ద పొరపాటు ఏమిటి.. మన దగ్గర డబ్బు ఉండాలంటే ఆ పొరపాటును ఎలా సరిదిద్దుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు డబ్బు నోట్ల రూపంలోనే కాకుండా నాణేల రూపంలో కూడా ఉంటుంది. నాణేలను ఇష్టపడే వారు కూడా ఉంటారు. మనం నోట్లను భద్రపరుస్తాం కానీ నాణేలను భద్రపరచం. బయట వస్తువులను కొనుగోలు చేయగా వచ్చిన డబ్బులను మనం ఎక్కడపడితే అక్కడ పెడుతూ ఉంటాం. ఇంటి నిండా ఎక్కడపడితే అక్కడ చిల్లర నాణేలను ఉంచకూడదు. దీని వల్ల కూడా ఆర్థిక సమస్యలు వస్తాయి. నోట్లైనా, నాణేలైనా అవి డబ్బులే. నాణేలను ఇష్టం వచ్చినట్టు పడేయకూడదు. దుమ్ము పడే దగ్గర కూడా ఉంచకూడదు. చిల్లర నాణేలను ఎక్కడ పడితే అక్కడ ఉంచడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చిల్లర నాణాలు కూడా లక్ష్మీ దేవి స్వరూపమే. ఇంట్లో దక్షిణాన చిల్లర డబ్బులను ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ధన వృద్ధి కలగదు. ఇంట్లో ఉండే చిల్లరనంతా ఒక డబ్బాలో వేసి ఉత్తర దిక్కున లేదా తూర్పు దిక్కున ఉంచాలి. ఇలా చేయడం వల్ల ధన వృద్ధి కలుగుతుంది. మన దగ్గర డబ్బు నిలకడగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చిల్లర నాణేలను ఎక్కడపడితే అక్కడ పడేసే అలవాటు ఉన్న వారు ఆ అలవాటును మానుకుని వాటిని ఉత్తర దిక్కున ఉంచడం వల్ల ధనాభివృద్ధి చెందుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. కనుక ఇకపై ఎవరైనా సరే చిల్లర నాణేలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాటిని పైన తెలిపినట్లుగా ఒక చోట ఉంచాలి. దీంతో ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు.