Papaya Seeds : మనం ఆహారంగా తీసుకునే పండ్లలో బొప్పాయి పండు కూడా ఒకటి. చక్కని రంగును, రుచిని బొప్పాయి పండు కలిగి ఉంటుంది. బొప్పాయి పండు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలను బొప్పాయి పండు కలిగి ఉంటుంది. మనం బొప్పాయి పండును తిని దానిలో ఉండే గింజలను పడేస్తాము. కానీ బొప్పాయి పండు కంటే బొప్పాయి పండులో ఉండే గింజలే అధిక పోషకాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ గింజలు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. బొప్పాయి గింజలలో ఉండే ఔషధ గుణాల గురించి, పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి పండు మనకు ఎప్పుడుపడితే అప్పుడే దొరుకుతుంది. దీనిని తిపడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి గింజలను చాలా తక్కువ మోతాదులో తినడం వల్ల శరీరానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ బొప్పాయి గింజలు జలుబు, దగ్గు వంటి సాధారణ అనారోగ్య సమస్యల నుండే కాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా మనల్ని రక్షిస్తాయి. బొప్పాయి గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడంలో కూడా ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
జీర్ణకోశంలో ఉండే బాక్టీరియాను చంపి జీర్ణకోశ సంబంధిత సమస్యల బారిన పడకుండా చేయడంలో ఇవి సహాయపడతాయి. నెలసరి సమయంలో స్త్రీలు బొప్పాయి గింజలను తీసుకోవడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. గర్భిణీ స్త్రీ లు ప్రసావానంతరం వీటిని తీసుకోవడం వల్ల నొప్పులు త్వరగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి గింజలను చేదుగా ఉంటాయి. కనుక వీటిని చాలా మంది నేరుగా తినలేరు. అలాంటి వారు ఈ గింజలను పొడిగా చేసి ఆ పొడిని మనం తాగే జ్యూస్ లలో కలుపుకుని తీసుకోవచ్చు. బొప్పాయి గింజలను తరచూ తీసుకోవడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు.
బొప్పాయి గింజలకు తేనెను కలిపి తీసుకోవడం వల్ల పురుషులలో వచ్చే సంతాన లేమి సమస్యలు తగ్గుతాయి. బొప్పాయి గింజలకు తేనెను కలిపి తీసుకోవం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. నీరసం తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. చర్మం పై ఉండే ముడతలు కూడా తగ్గుతాయి. బొప్పాయి పండు గింజలను, తేనెను కలిపి పేస్ట్ గా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. బొప్పాయి పండు గింజలను తినడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఉండే విష పదార్థాలు తొలగిపోతాయి. బొప్పాయి పండు గింజల పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి నిమ్మరసాన్ని కలిపి తీసుకోవడం వల్ల కాలేయం బలంగా తయారవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. క్యాన్సర్ కణాలను, కణతులను పెరగకుండా చేయడంలో కూడా బొప్పాయి గింజలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తరచూ తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ గింజలను తినడం ప్రారంభించే ముందు చిన్నగా, బాగా పండిన బొప్పాయి పండులో ఉండే గింజలను తీసుకోవాలి. బాగా పండిన బొప్పాయిలో ఉండే గింజలు తక్కువ చేదుగా ఉంటాయి. వీటిని మిరియాలకు బదులుగా వంటల్లో కూడా ఉపయోగించవచ్చు.ఈ విధంగా బొప్పాయి పండ్లే కాకుండా బొప్పాయి గింజలు కూడా మనకు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి రసాయనాలను ఉపయోగించని బొప్పాయి పండ్లను, గింజలను మాత్రమే తినడానికి ఉపయోగించాలని, వీటిని తినడం వల్ల మాత్రమే మనం అధిక ప్రయోజనాలను పొందగలమని నిపుణులు చెబుతున్నారు.