Gifts : అప్పుడప్పుడు మనం ఎవరిదైనా పుట్టినరోజు లేదంటే ఎవరినైనా అభినందించాలన్నా, సర్‌ప్రైజ్ చేయాలన్నా బహుమతుల్ని ఇస్తూ ఉంటాము. బహుమతుల్ని ఇచ్చేటప్పుడు కూడా కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. స్నేహితులకి కానీ కుటుంబ సభ్యులకి కానీ లేదంటే ఎవరికైనా కానీ బహుమతులు ఇచ్చేటప్పుడు వీటిని ఇస్తే దురదృష్టం కలుగుతుంది. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఈ పొరపాట్లని అస్సలు చేయకూడదు.
బహుమతులను ఇచ్చేటప్పుడు వీటిని బహుమతుల కింద ఇవ్వకుండా చూసుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ కూడా పదునైన వస్తువులను ఇవ్వకూడదు. ఉదాహరణకి కత్తుల లాంటి వాటిని మీరు ఎవరికైనా బహుమతిగా ఇస్తే దురదృష్టం కలుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఎప్పుడూ కూడా ఇతరులకి వాచీలని గిఫ్ట్ కింద ఇవ్వకూడదు. ఎవరికైనా వాచీని గిఫ్ట్ గా ఇస్తే రిలేషన్ పాడవుతుంది. దురదృష్టం కలుగుతుంది.
వాచీ కానీ గడియారాలు కానీ ఎప్పుడూ కూడా ఎవరికీ ఇవ్వకండి. వాలెట్లని కూడా ఎవరికీ బహుమతి కింద ఇవ్వకూడదు. వాలెట్లు వంటివి ఇస్తే దురదృష్టం కలుగుతుంది. సమస్యలు ఎక్కువవుతాయి. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం అక్వేరియం వంటి వాటిని కూడా బహుమతి కింద ఇవ్వకూడదు. నీళ్లు పోసి అందంగా అలంకరించే వస్తువుల వంటివి ఏమీ కూడా ఇవ్వకూడదు. ఇలాంటివి ఇవ్వడం వలన కష్టాలు వస్తాయి. దురదృష్టం కలుగుతుంది.
పని చేసుకునే వస్తువులను కూడా ఇవ్వకూడదు. అంటే పెన్నులు, పుస్తకాలు మొదలైన స్టేషనరీ సామాన్లను కూడా బహుమతి కింద ఇవ్వకూడదు. ఇవి కూడా దురదృష్టాన్ని తీసుకువస్తాయి. చూశారు కదా ఎటువంటి వాటిని బహుమతుల కింద ఇస్తే ఎలాంటి సమస్యలు వస్తాయని. మరి ఈసారి వీటిని గుర్తు పెట్టుకుని ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోండి. వీటిని కనుక బహుమతిగా ఇచ్చినట్లయితే కష్టాలు తప్పవు. దురదృష్టం మీ వెంట ఉంటుంది. అదృష్టం కలగదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకుండా చూసుకోవడం మంచిది.