vastu

Vastu Tips : ఈ 8 ప‌నులను చేయ‌కండి.. వాస్తుదోషాల‌ను త‌ప్పించుకోండి..

Vastu Tips : నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి నిద్రించే వ‌ర‌కు మ‌నం చాలా ప‌నులు చేస్తాం. వాటిల్లో అనేక‌మైన ర‌కాల ప‌నులు ఉంటాయి. అయితే మీకు తెలుసా..? రోజూ మీరు చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీకు వాస్తు దోషం క‌లుగుతుంద‌ని..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. కొన్ని ర‌కాల ప‌నులు చేయ‌డం వ‌ల్ల మీకు వాస్తు దోషం క‌లుగ‌తుంది. దీంతో ఏం చేసినా క‌ల‌సి రాదు. దుర‌దృష్టం వెన్నంటి ఉంటుంది. డ‌బ్బు వృథాగా ఖర్చ‌వుతుంది. మ‌రి అలాంటి ప‌నులు ఏవో ఇప్పుడు తెలుసుకుందామా.

1. ప‌గిలిన వ‌స్తువులు

ప‌గిలిన వ‌స్తువుల్లో ఆహారం తిన‌రాదు. కాఫీ, టీ, జ్యూస్ లేదా నీరు వంటి ద్ర‌వాల‌ను కూడా తాగ‌రాదు. అస‌లు ప‌గిలిన వ‌స్తువుల‌ను ఇంట్లోంచి వెంట‌నే తీసేయాలి. దీంతో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. లేదంటే దుర‌దృష్టం వెంటాడుతుంది. ఏదీ క‌ల‌సి రాదు.

2. వాహ‌నాలు

కారు లేదా బైక్ ఏవి ఉప‌యోగించినా చాలా మంది వాటిని తుడ‌వ‌కుండానే దుమ్ము, ధూళితో అలాగే వాటిని బ‌య‌ట‌కు తీసి వాటిపై వెళ్తారు. కానీ అలా చేయ‌కూడ‌దు. వాహ‌నాల‌ను క్లీన్ గా తుడిచాకే వాటిల్లో ప్ర‌యాణించాలి. లేదంటే వాస్తు దోషం క‌లుగుతుంద‌ట‌. బ్యాడ్ ల‌క్ వెన్నంటి ఉంటుంద‌ట‌.

do not make these 8 mistakes escape from vastu dosham

3. పిల్ల‌లు

చాలా మంది త‌ల్లిదండ్రులు, పెద్ద‌లు త‌మ పిల్ల‌ల‌ను ఉద‌యాన్నే గ‌ద‌మాయిస్తూ, అరుస్తూ నిద్ర లేపుతారు. నిజానికి అలా చేయ‌రాద‌ట‌. ముఖంపై చిరున‌వ్వుతో మృదువుగా మాట్లాడుతూ నిద్ర లేపాల‌ట‌. దీంతో ఆ పిల్ల‌లు రోజంతా ఉత్సాహంగా ఉంటార‌ట‌. వారు అనేక అంశాల్లో చ‌క్క‌గా రాణిస్తార‌ట‌. అలా మృదువుగా తట్టి లేపడం వ‌ల్ల వారిలోకి పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌వేశిస్తుంద‌ట‌. దీంతో వారు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటార‌ట‌.

4. నీరు

ఉద‌యాన్నే ఇంటి నుంచి బ‌య‌ల్దేరి ఎక్క‌డికి వెళ్లినా ఉత్త చేతుల‌తో వెళ్ల‌కూడ‌దు. క‌నీసం ఒక బాటిల్‌లో నీటిని అయినా వెంట తీసుకెళ్లాలి. దీంతో పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంది. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది.

5. అల్పాహారం

చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ మానేసి నేరుగా మ‌ధ్యాహ్నం లంచ్ చేస్తారు. అలా చేయ‌కూడ‌దు. ఉద‌యాన్నే క‌చ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిందే. దీంతో శ‌రీరం ఉత్తేజంగా మారుతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంది. ఏ ప‌నినైనా చేసే శ‌క్తి వ‌స్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. బ్రేక్‌ఫాస్ట్ చేసేంత టైమ్ లేక‌పోతే క‌నీసం పండ్ల‌ను అయినా తినాలి.

6. బ్యాగ్

చాలా మంది తాము రోజూ వెంట తీసుకెళ్లే బ్యాగుల్లో వృథా పేప‌ర్లు, క‌వ‌ర్లు, ఇత‌ర వ‌స్తువులు పెడ‌తారు. అలా ఉంచ‌రాదు. బ్యాగును రోజూ ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా ఉన్న బ్యాగుతోనే బ‌య‌ట‌కు వెళ్లాలి. అందులో చెత్త వ‌స్తువులు ఉండ‌రాదు. ఇలా చేస్తే ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ట‌.

7. ఆఫీస్ఆఫీసుల్లో ప‌నిచేసే ఉద్యోగులు గ‌తం రోజు ఆఫీస్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను మ‌రిచిపోవాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆఫీస్‌లోకి ఎంట‌ర్ అయ్యేట‌ప్పుడు ఫ్రెష్‌గా ఉండాలి. తాజాగా ప‌ని ప్రారంభించాలి. దీంతో అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. అనుకున్న ప‌నులు నెర‌వేరుతాయి.

8. ఆహారం

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసే వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్లేట్‌లో పెట్టుకున్న ఆహారాన్ని వ‌దిలిపెట్ట‌రాదు. మొత్తం తినేయాలి. లేదంటే బ్యాడ్ ల‌క్ వెన్నంటి ఉంటుంది. ఏదీ క‌ల‌సి రాదు.

Admin

Recent Posts