Pillow Covers : సుఖంగా, సౌకర్యంగా నిద్రపోయేందుకు మనం తప్పనిసరిగా తల కింద దిండు పెట్టుకుంటాం. తల కింద దిండు ఉంటే మెడ నొప్పి రాకుండా ఉంటుంది. దిండు వల్ల మనం సుఖంగా నిద్రపోవచ్చు. కొందరు అసలు దిండు వాడరు. కానీ చాలా మంది మాత్రం తప్పనిసరిగా దిండును ఉపయోగిస్తారు. కొందరు ఎత్తైన దిండును వాడుతారు. కొందరు మాత్రం తేలికపాటి దిండును ఉపయోగిస్తారు. అయితే మనం రోజూ నిద్రకు ఉపయోగించే దిండు విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే మన చర్మానికి హాని కలుగుతుంది. మరి ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
మనం దిండు మీద కవర్ వేసి వాడుతాం కదా. అయితే మనం రోజూ దిండుపై తలపెట్టి పడుకుంటాం కనుక దిండు కవర్‌పై దుమ్ము, ధూళి కణాలు, నూనె, డెడ్ స్కిన్ సెల్స్, హానికరమైన బాక్టీరియా, వైరస్‌లు, ఇంట్లో ఉండే పెంపుడు జంతువులకు చెందిన వెంట్రుకలు పేరుకుపోతుంటాయి. ఈ క్రమంలో అలాంటి దిండుపై మనం తలపెట్టి నిద్రిస్తే మన చర్మంపై అవి ప్రభావం చూపిస్తాయి. దీంతో మనకు ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి వస్తాయి. అలాగే కొందరికి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా దిండు కవర్లు మన చర్మానికి హాని కలిగిస్తాయి. కనుక దిండు కవర్‌లను కచ్చితంగా వారానికి ఒకసారి అయినా సరే మార్చాల్సి ఉంటుంది.
ఇక దిండ్లను అయితే 6 నెలలకు ఒకసారి మార్చాలి. మార్చడం వీలు కాదనుకుంటే దిండ్లను ఉతకాలి, లేదా డ్రై క్లీన్ చేయించవచ్చు. ఇలా దిండ్లు, వాటి కవర్లను రెగ్యులర్‌గా క్లీన్ చేస్తుండడం వల్ల మీ చర్మంపై ఎలాంటి ప్రభావం పడదు. లేదంటే కొందరికి అలర్జీలు కూడా వచ్చే చాన్స్ ఉంటుంది. ఇక ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం దిండు కవర్ సిల్క్‌తో చేసినది అయితే మంచిదట. ఎందుకంటే దానిపై బాక్టీరియా, దుమ్ము, ధూళి వంటివి తక్కువగా పేరుకుపోతాయి. కనుక సిల్క్‌తో చేసిన దిండు కవర్లను వాడితే మంచిది. ఇది చర్మానికి కూడా మంచిదట. కనుక దిండ్లు, దిండ్ల కవర్ల విషయంలో ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.