వినోదం

Manchu Vishnu : మంచు విష్ణుకి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా ?

Manchu Vishnu : సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన వారసులుగా మంచు మనోజ్, మంచు విష్ణు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఇక మంచు విష్ణు విషయానికి వస్తే 2003వ సంవత్సరంలో హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విష్ణు మొదటి సినిమాతోనే ఫ్లాప్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఢీ చిత్రం విష్ణుకి ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇలా పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణుకి ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయని చెప్పవచ్చు.

manchu vishnu net worth and assets value

ఇక సినిమా అవకాశాలు పెద్దగా లేకున్నప్పటికీ మంచు కుటుంబం పలు వ్యాపారాలు, విద్యాసంస్థలను నడుపుతూ ఆస్తిని బాగా పోగు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంచు విష్ణుకు దాదాపుగా రూ.1900 కోట్ల ఆస్తి ఉందని తెలుస్తోంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతున్నారు. ఇకపోతే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు గెలుపొంది మా అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు.

Admin

Recent Posts