Durga Devi : మనం ఏ పూజ చేయాలన్నా కచ్చితంగా పూలు మనకి ఉండాలి. ఏ శుభకార్యం అవ్వాలన్నా కూడా పూలు ముఖ్యమైనవి. రోజూ దేవుడికి పూజ చేయాలన్నా, పండగలప్పుడైనా సరే కచ్చితంగా మనం పూలతో పూజ చేస్తూ ఉంటాం. పూజల సమయంలో దేవుళ్ళకి పూలను సమర్పిస్తూ ఉంటాం. అష్టోత్తరాలు చదువుతూ పూలు పెడుతూ ఉంటాం. అయితే మనకి అందుబాటులో ఉన్న పూలని మనం కోసి లేదంటే కొని తెచ్చి దేవతలకి పెడుతూ ఉంటాం. దుర్గాదేవిని ఆరాధించేటప్పుడు ఈ పూలని పెట్టడం మంచిదని పండితులు చెబుతున్నారు.
అయితే దుర్గాదేవిని మామూలు సమయంలో ఆరాధించేటప్పుడు ఈ పూలను పెట్టవచ్చు. అలాగే నవరాత్రి వేళల్లో కూడా ఈ పూలని పెట్టడం మంచిది. అమ్మవారికి మందార పూలు అంటే చాలా ఇష్టం. మందార పూలని అమ్మవారికి పెడితే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని మందారం పూలతో పూజించాలని పండితులు అంటున్నారు. మందార పూలతోపాటు ఆ దేవతకి నెయ్యిని కూడా అర్పించవచ్చు.
అలాగే అమ్మవారికి చామంతి పూలు అంటే కూడా ఇష్టం. చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే అనుకున్నవి నెరవేరుతాయి. నవరాత్రుల సమయంలో రెండో రోజు అమ్మవారికి చామంతి పూలతో పూజ చేయాలి. అమ్మవారిని కమలం పూలతో పూజ చేస్తే కూడా మంచి జరుగుతుంది. నవరాత్రుల్లో మూడవ రోజు కమలం పూలతో అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తే మంచిది.
మల్లెపూలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. నవరాత్రుల్లో నాలుగో రోజు మల్లెపూలతో పూజిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. ఐదవ రోజు పసుపు గులాబీలతో ఆరాధించాలి. ఆరవ రోజు బంతిపూలతో, ఏడవ రోజు కృష్ణ కమలంతో, ఎనిమిదవ రోజు బొండు మల్లె పూలతో పూజిస్తే మంచిది. తొమ్మిదవ రోజు సంపంగి పూలతో పూజ చేయాలి. అయితే నవరాత్రి సమయంలోనే కాకుండా మామూలు సమయంలోనూ అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఈ పూలని అమ్మవారికి పెట్టి ఆరాధిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. అంతా మంచే జరుగుతుంది. అనుకున్నవి నెరవేరుతాయి. ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు సిద్ధిస్తాయి.