వినోదం

Sudheer : సుడిగాలి సుధీర్ అసలు పేరు ఏంటో తెలుసా ?

Sudheer : బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించాడు.

సుధీర్ తన నటనతో కేవలం బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండితెరపై అవకాశాలను కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే త్రీ మంకీస్, సాఫ్ట్‌వేర్‌ సుధీర్ సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితమైన సుధీర్ అసలు పేరు ఏంటో తెలుసా ? నిజానికి సుధీర్ అసలు పేరు సుధీర్ కాదు.

do you know about sudigali sudheer real name

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సుడిగాలి సుధీర్ గా పేరు సంపాదించుకున్న ఇతనిని ఇంట్లో సుధీర్ అనే పేరుతో కాకుండా తన ఒరిజినల్ పేరుతో మాత్రమే పిలుస్తారు. సుధీర్ అసలు పేరు సిద్దు.. ఇంట్లో సుధీర్ ని అందరూ కూడా సిద్దు అనే పేరుతో పిలుస్తారు. కేవలం బయట మాత్రమే ఇతడు సుడిగాలి సుధీర్ గా అందరికీ పరిచయం. అయితే ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ అక్క కెనడా నుంచి వచ్చి ఓ కార్యక్రమంలో భాగంగా స్టేజిపై నుంచి సిద్ధూ అని పిలవగా అందరూ సిద్దు ఎవరాని ఆశ్చర్యంగా చూడగా ఆ సిద్ధూ మన సుడిగాలి సుధీర్ అని తెలియడంతో సుధీర్ అసలు పేరు సుధీర్ కాదని.. సిద్ధూ అని.. అందరికీ తెలిసింది.

Admin

Recent Posts