హెల్త్ టిప్స్

Sweets : తీపి తినాల‌ని కోరిక‌గా ఉందా.. అయితే ఇలా చేయండి..!

Sweets : త‌ర‌చుగా స్వీట్స్ మీద‌కు మ‌న‌సు మ‌ళ్ల‌డానికి కొన్ని కార‌ణాలు ఉంటాయి. వాటిని తెలుసుకుని స‌రిదిద్దుకోగ‌లిగితే స్వీట్ల‌తో పెరిగే అద‌న‌పు శ‌రీర భారాన్ని అదుపు చేసుకోవ‌చ్చు. ఒత్తిడి, అల‌స‌ట‌, నిద్ర‌లేమి.. తీపి తినాల‌నిపించ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు. శ‌క్తి త‌గ్గిన‌ప్పుడు శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి అందించ‌డం కోసం తీపి మీద‌కు మ‌న‌సు మ‌ళ్లుతుంది. ఇలా అనిపించిన వెంట‌నే తీపి ప‌దార్థాల కోసం వెతుక్కోకండి. ఒక‌సారి తీపి తిన‌డం మొద‌లుపెడితే అది అలాగే కొన‌సాగుతుంది. కాబ‌ట్టి స్వీట్ల జోలికి వెళ్ల‌కుండా మూల కార‌ణాన్ని స‌రిదిద్ద‌డం మీద మ‌న‌సు పెట్టండి.

స్వీట్ల మీద ఇష్టం పెర‌గడానికి వ్యాయామం కొర‌వ‌డ‌డం మ‌రో కార‌ణం. శ‌రీరం యాక్టివ్‌గా లేన‌ప్పుడు బ‌ద్ద‌కం ఆవ‌రిస్తుంది. దాంతో మ‌న‌సు క‌ప్ కేక్స్‌, చాక్లెట్ల మీద‌కు మ‌ళ్లుతుంది. కాబ‌ట్టి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండ‌డం త‌ప్ప‌నిస‌రి. షుగ‌ర్ క్రేవింగ్‌కు డీహైడ్రేష‌న్ మ‌రో కార‌ణం. శ‌రీరంలో నీటి శాతం త‌గ్గిన‌ప్పుడు చ‌క్కెర ప‌దార్థాలు తినాల‌పిసిస్తుంది. కాబ‌ట్టి తీపి తినాల‌నిపించిన‌ప్పుడు నీళ్లు తాగాలి.

if you want to eat sweet then do like this

తీపి తినాల‌నుకునే కోరిక‌ను కంట్రోల్ చేసుకోలేక‌పోతే ఈ చిట్కాల‌ను పాటించండి. చాక్లెట్లు తినాల‌నిపిస్తే 70 శాతం డార్క్ చాక్లెట్ రెండు ముక్క‌లు మాత్ర‌మే తినండి. చిల‌గ‌డ దుంప‌లు, స్వీట్ కార్న్‌, ఎండు ద్రాక్ష‌లు బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. 2 ఖ‌ర్జూరాలు, 2 యాప్రికాట్స్, 4 ఎండు ద్రాక్ష‌, 2 అంజీర్‌.. వీటిల్లో ఏదో ఒక‌టి తిన‌వ‌చ్చు.

Admin

Recent Posts