mythology

లక్ష్మీదేవి తామర పువ్వు పై కొలువై ఉండటానికి కారణం ఏమిటో తెలుసా?

సాధారణంగా మనం లక్ష్మీదేవి ఫోటోను గమనిస్తే మనకు అమ్మవారు తామర పువ్వు పై ఆసీనురాలై మనకు దర్శనం కల్పిస్తుంటారు. అయితే లక్ష్మీదేవి కేవలం తామరపువ్వు పై కూర్చుని మాత్రమే మనకు దర్శనం కల్పించడానికి గల కారణం ఏమిటి అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే లక్ష్మీదేవి తామర పువ్వు పై కొలువై ఉండటానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా తామరపువ్వు బురదలో నుంచి బయటకు వస్తుంది. కానీ తామర పువ్వుకు మాత్రం ఎటువంటి బురద అంటుకొని ఉండదు. అదేవిధంగా మన మనసులో కూడా ఎటువంటి కల్మషం లేకుండా ఇతరులు అనే మాటలు పట్టించుకోకుండా స్వచ్ఛమైన మనసుతో మెలగాలని తామర పువ్వు మనకు సూచిస్తుంది. మన మనస్సు ఎంతో అలజడిగా ఉన్నప్పుడు తామర పువ్వు ని చూస్తే మనసు ప్రశాంతంగా కనిపిస్తుంది.

why lakshmi devi sits on lotus flower

తామర పువ్వు ఎల్లప్పుడు సరస్సులలో, కొలనులలో, నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలలో వికసిస్తుంది. తామర పువ్వు నీటి ప్రవాహం ఎటువైపు ఉంటే అటువైపు కదులుతూ ఒకచోట నిలకడ లేకుండా ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో నిలకడగా ఉండకుండా కొన్ని రోజులు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే మరికొన్ని రోజులు ఆర్థిక సమస్యలను కలిగిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటివిషయాలను మనకు తెలియజేయడానికి లక్ష్మీదేవి తామర పువ్వు పై కొలువై ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts