వినోదం

అల వైకుంఠ‌పుర‌ములో మూవీలో చూపించిన ఇల్లు ఖ‌రీదు ఎంతో తెలుసా..?

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరియు పూజ హెగ్డే కలిసి నటించిన అలా వైకుంఠపురంలో చిత్రం 2020లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డాన్స్ పెర్ఫార్మెన్స్ గానీ, డైలాగ్ డెలివరీ కానీ అందరినీ ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి గాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ సంస్థ నిర్మాణ సారథ్యం వహించారు. తమన్ సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ అని చెప్పవచ్చు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ చిత్రంలో అందరినీ బాగా ఆకట్టుకున్న మరో అంశం ఏమిటంటే..?

ఈ చిత్రంలో కనిపించే ఇల్లు. సినిమాలో ఈ భారీ ఇంటిలో టబు ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ అసలైన తల్లిదండ్రులు ఉంటారు. సినిమా ప్రారంభంలోనే అల్లు అర్జున్ ఈ ఇంటిలో అడుగుపెడతాడు. అప్పుడు ఇంటి గేట్ ను చూపిస్తారు. ఆ తరవాత ఇంట్లో చాలా సన్నివేశాలు చిత్రీకరించారు . అంతేకాకుండా ఈ ఇంటిలో తీసిన సీన్స్ అని ఎంతో అందంగా కనిపించాయి.

do you know about this house cost in ala vaikunthapuramulo movie

థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులను ఈ ఇల్లు బాగా ఆకట్టుకుంది. ఇంద్రభవనంలా కనిపించే ఆ ఇంటిని చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంటి ముందు భారీ గేట్, ఇంట్లో ఫర్నిచర్, చుట్టూ చెట్లు, విశాలమైన ఇంటి ముందు స్థలం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక అల్లు అర్జున్ కు సైతం ఇల్లు చాలా చాలా నచ్చేసిందట. అంతేకాకుండా తాను కూడా అలాంటి ఇంటిని కట్టుకోవాలని బన్నీ ఎప్పటినుంచో అనుకున్నాడట. మరీ ఆ అందమైన ఇల్లు మరెవరిదో కాదు. ఎన్టీవీ ఛైర్మెన్ నరేంద్ర చౌదరి కూతురు రచనా చౌదరి భర్తది. ఆ ఇంటి నిర్మాణం కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేసారట.

ఈ సినిమా బ్యానర్ నిర్మాత అయిన రాధాకృష్ణకు ఇంటి యజమానులు బంధువులు అవుతారు. అయితే సినిమా ఆర్ట్ డైరెక్టర్ భారీ ఇంటి సెట్స్ నిర్మించాలని చెప్పడంతో రాధాకృష్ణ ఆ ఇల్లు చూపించి అదే ఇంటిని ఫైనల్ చేశారట. ఇక ఈ ఇంటికి బయట ఉండే కొన్ని సీన్స్ కోసం 5 కోట్లతో అన్నపూర్ణ స్టడియోలో సెట్స్ వేసి తీసినట్టు తెలుస్తోంది.

Admin

Recent Posts